News October 13, 2024
బీటెక్ అర్హతతో ఇంజినీర్ ఉద్యోగాలు.. భారీగా జీతం

హిందూస్థాన్ ఉర్వరక్ అండ్ రసాయన్ (HURL)లో 212 డిప్లొమా అండ్ గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తులు కొనసాగుతున్నాయి. కెమికల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాల్లో ఖాళీలున్నాయి. అక్టోబర్ 21 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్హత: డిప్లొమా/బీఈ/బీటెక్. జీతం: రూ.23,000 నుంచి రూ.1,40,000. పూర్తి వివరాలకు <
Similar News
News November 28, 2025
శ్రీహరిపురంలో యువకుడు ఆత్మహత్య

శ్రీహరిపురంలోని తన ఇంట్లో ఓ యువకుడు వంశీ ఫ్యానుకు ఊరివేసుకుని తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నాడు. మల్కాపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతికి గల కారణాలపై కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మల్కాపురం సీఐ గొల్లగాని అప్పారావు తెలిపారు.
News November 28, 2025
స్లీప్‌వెల్ అగరబత్తీల్లో ప్రమాదకర రసాయనాలు

AP: దోమల నివారణకు ఉపయోగించే స్లీప్‌వెల్ అగరబత్తీల్లో ప్రమాదకర మేపర్‌ఫ్లూథ్రిన్ అనే పురుగుమందు ఉన్నట్లు తేలింది. ఇటీవల విజయవాడలోని ఓ షాపులో తనిఖీలు చేసి స్లీప్‌వెల్ అగరబత్తీల నమూనాలను అధికారులు సేకరించారు. వాటిని HYDలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్కు పంపగా ప్రాణాంతక కెమికల్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీనివల్ల శ్వాసకోశ, నాడీ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
News November 28, 2025
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భారీగా ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

బ్యాంక్ ఆఫ్ ఇండియా(BOI)లో 115 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి B.Tech/ BE, MSc, MCA ఉత్తీర్ణులై, 22- 45ఏళ్ల మధ్య ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు జీతం రూ.64,820- రూ.1,20,940 వరకు చెల్లిస్తారు. ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.


