News March 1, 2025
ఇంగ్లండ్‌కు నిరాశ.. సౌతాఫ్రికా విజయం

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌తో మ్యాచులో సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యాన్ని 29.1 ఓవర్లలో ఛేదించింది. ఆ జట్టు బ్యాటర్లలో డస్సెన్ (72), క్లాసన్ (64) రాణించారు. ఇప్పటికే సౌతాఫ్రికాకు సెమీస్ బెర్తు ఖరారు కాగా, ఇంగ్లండ్ ఒక్క విజయం కూడా లేకుండానే నిరాశతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.
Similar News
News December 5, 2025
తిరుమలలో కొన్ని పేర్లు మారుతున్నాయి!

తిరుమలలోని కొన్ని వీధుల పేర్లను మార్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడుకు టీటీడీ ప్రతిపాదనలు పంపగా ఆయన ఆమోదం తెలిపారు. ఇప్పటివరకు ఆర్బ్ సెంటర్, మేదరమిట్ట, ముళ్లగుంత వంటి పేర్లకు బదులు శ్రీవారి సేవలో తరించిన పరమ భక్తుల పేర్లను పెట్టనున్నారు. వీటికి సంబంధించిన మార్పులను టీటీడీ త్వరలో అధికారికంగా అమలు చేసే అవకాశం ఉంది.
News December 5, 2025
రైతన్నా.. ఈ పురుగుతో జాగ్రత్త

ఖరీఫ్ పంట కోతలు, రబీ పంట నాట్ల వేళ ఏపీ వ్యాప్తంగా 800కు పైగా స్క్రబ్‌టైఫస్ కేసులు నమోదవ్వడం కలవరపెడుతోంది. చిగ్గర్ అనే పురుగు కాటుకు గురైనవారు తీవ్రజ్వరం, ఒంటి నొప్పులు, వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిపాలవుతున్నారు. పొలాలు, అడవులు, తడి నేల, పశువుల మేత ప్రాంతాల్లో పని చేసేవారికి ఈ పురుగుకాటు ముప్పు ఎక్కువగా ఉంది. స్క్రబ్ టైఫస్ లక్షణాలు, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News December 5, 2025
రో-కో భవిష్యత్తును వారు నిర్ణయించడం దురదృష్టకరం: హర్భజన్

తమ కెరీర్‌లో పెద్దగా ఏం సాధించని వారు రోహిత్, కోహ్లీ భవిష్యత్తును నిర్ణయిస్తుండటం దురదృష్టకరమని భారత మాజీ క్రికెటర్ హర్భజన్ వ్యాఖ్యానించారు. తనతో పాటు తన సహచరులకు ఇలాంటి పరిస్థితే ఎదురైందని చెప్పారు. రోహిత్, కోహ్లీ నిరంతరం పరుగులు చేస్తూ బలంగా ముందుకు సాగుతున్నారన్నారు. AUS సిరీస్‌కు ముందు నుంచే కోచ్ గంభీర్‌తో ‘రో-కో’కు పడట్లేదన్న పుకార్ల నడుమ భజ్జీ వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.


