News November 15, 2024

టీ20 సిరీస్ ఇంగ్లండ్ కైవసం

image

మూడో టీ20లో వెస్టిండీస్‌పై ఇంగ్లండ్ గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 145/8 స్కోర్ చేసింది. ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 19.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో 3 వికెట్ల తేడాతో గెలిచింది. తద్వారా 5 మ్యాచ్‌ల టీ20ల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 3-0తో కైవసం చేసుకుంది.

Similar News

News November 2, 2025

రాష్ట్రంలో ‘మిట్టల్ స్టీల్’కు పర్యావరణ అనుమతులు!

image

AP: అనకాపల్లి సమీపంలో ఆర్సెలార్ మిట్టల్-నిప్పాన్ స్టీల్స్ ఏర్పాటు చేయబోతున్న ఉక్కు పరిశ్రమకు నిపుణుల కమిటీ పర్యావరణ అనుమతులకు సిఫారసు చేసింది. 14 నెలల రికార్డ్ టైమ్‌లో ఇది సాధ్యమైనట్లు ప్రభుత్వం తెలిపింది. రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఈ పరిశ్రమ దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ఫ్యాక్టరీగా నిలవనుంది. ఈనెల 14, 15 తేదీల్లో జరగనున్న CII సదస్సులో దీనికి భూమిపూజ చేయనున్నారు.

News November 2, 2025

రాజమండ్రిలోని NIRCAలో 27 ఉద్యోగాలు

image

రాజమండ్రిలోని ICAR- <>NIRCA<<>>(నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ కమ్యూనల్ అగ్రికల్చర్)లో 27 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల అభ్యర్థులు NOV 14లోగా ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. పోస్టును బట్టి ఎంటెక్, MSc(అగ్రోనమీ), బీటెక్, BSc( అగ్రికల్చర్/లైఫ్ సైన్స్/అగ్రికల్చర్ డిప్లొమా), MSc(అగ్రికల్చర్/మాలిక్యులార్ బయాలజీ/ బయో టెక్నాలజీ/జెనిటిక్స్/లైఫ్ సైన్స్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

News November 2, 2025

ఇతిహాసాలు క్విజ్ – 54

image

1. కర్ణుడిని బ్రహ్మాస్త్ర మంత్రం మరిచిపోయేలా శపించింది ఎవరు?
2. అర్జునుడిని చంపిన తన కొడుకు పేరేంటి?
3. త్రిపురాసురుని సంహారంలో శివుడి రథ సారథి ఎవరు?
4. సతీదేవి దేహం భూమ్మీద పడిన స్థలాలను ఏమంటారు?
5. ఇంద్రుడు భీష్ముడికి ఇచ్చిన వరం ఏమిటి?
<<-se>>#Ithihasaluquiz<<>>