News June 16, 2024

ఇంగ్లండ్ సూపర్-8 ఆశలు సజీవం

image

T20WCలో తప్పక గెలవాల్సిన మ్యాచులో ఇంగ్లండ్ విజయం సాధించింది. నమీబియాతో జరిగిన మ్యాచులో వర్షం కారణంగా ఓవర్లు కుదించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన ENG 10 ఓవర్లలో 122 పరుగులు చేసింది. ఛేదనలో నమీబియా తడబడింది. DLS ప్రకారం 10 ఓవర్లలో 127 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా 84 పరుగులకే పరిమితమైంది. దీంతో ENG సూపర్-8 ఆశలు సజీవంగా ఉన్నాయి. ఒకవేళ AUSపై స్కాట్లాండ్ గెలిస్తే ENG టోర్నీ నుంచి నిష్క్రమించనుంది.

Similar News

News November 11, 2025

CSKకి సంజూ శాంసన్ ఎందుకు?

image

సంజూ శాంసన్ CSKలో చేరడం దాదాపు ఖరారైంది. అయితే జడేజాను RRకు పంపి శాంసన్‌ను తీసుకోవడంలో చెన్నై జట్టుకు భవిష్యత్ ప్రయోజనాలున్నాయని క్రీడావర్గాలు చెబుతున్నాయి. ధోనీ తర్వాత సారథిగా సంజూ‌ బెటర్ అని యాజమాన్యం భావించినట్లు పేర్కొంటున్నాయి. కీపింగ్, స్ట్రాంగ్ బ్యాటర్ కోటాను ఫుల్‌ఫిల్ చేస్తారనే ట్రేడ్‌కు చెన్నై ఆసక్తి చూపినట్లు వివరిస్తున్నాయి. గతంలో జడేజాకు CSK కెప్టెన్సీ ఇవ్వగా ఫెయిలైన విషయం తెలిసిందే.

News November 11, 2025

‘రిచా’ పేరిట స్టేడియం

image

WWC విన్నర్ రిచా ఘోష్‌కు అరుదైన గౌరవం దక్కనుంది. స్వరాష్ట్రం వెస్ట్ బెంగాల్‌లో నిర్మించే స్టేడియానికి ఆమె పేరు పెట్టాలని CM మమతా బెనర్జీ నిర్ణయించారు. అక్కడి సిలిగురిలోని 27 ఎకరాల్లో స్టేడియం నిర్మించాలని స్థానిక మేయర్‌కు సూచించినట్లు సీఎం తెలిపారు. స్టేడియానికి రిచా పేరు పెడితే భవిష్యత్ తరాలకు ప్రేరణగా ఉంటుందని చెప్పారు. కాగా ఇటీవల రిచాను ప.బెంగాల్ ప్రభుత్వం DSPగా నియమించిన విషయం తెలిసిందే.

News November 11, 2025

‘SIR’పై నేటి నుంచి సుప్రీంలో విచారణ

image

దేశవ్యాప్తంగా ఎన్నికల జాబితా ప్రత్యేక సవరణ(SIR)ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై SCలో నేటి నుంచి విచారణ జరగనుంది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం వాదనలు విననుంది. అయితే కొత్తగా దాఖలయ్యే పిటిషన్లు ఏమైనా ఉంటే చీఫ్ జస్టిస్ గవాయ్ సమక్షంలో ప్రవేశపెట్టాలని ధర్మాసనం సూచించింది. SIRను వ్యతిరేకిస్తూ బెంగాల్ కాంగ్రెస్‌తో పాటు ADR స్వచ్ఛంద సంస్థ పిటిషన్లు వేశాయి.