News March 2, 2025
US అధికార భాషగా ఇంగ్లిష్

అమెరికా అధికార భాషగా ఇంగ్లిష్‌ను ఎంపిక చేస్తూ ఆదేశాలపై డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఫెడరల్ ప్రభుత్వ నిధులతో నడిచే ఆఫీసులు, సంస్థలు తమ సేవలను, పత్రాలను ఇంగ్లిషేతర భాషల్లో కొనసాగించాలా? వద్దా? అని ఎంచుకోవచ్చు. ఇంగ్లిష్‌ను అధికార భాషగా తీసుకోవడం ద్వారా ఉమ్మడి జాతీయ ప్రయోజనాలు బలోపేతం అవుతాయని, సమ్మిళిత, సమర్థవంతమైన సమాజాన్ని నిర్మించుకోవచ్చని ఈ ఆదేశాల్లో అమెరికా ప్రభుత్వం పేర్కొంది.
Similar News
News November 16, 2025
తూ.గో: మూడేళ్లుగా కన్న కూతురిపై తండ్రి లైంగిక దాడి

పెరవలి మండలంలోని ఓ గ్రామంలో 15 ఏళ్ల కుమార్తెపై కన్న తండ్రే మూడేళ్లుగా లైంగిక దాడికి పాల్పడిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక గర్భం దాల్చడంతో తల్లికి ఈ విషయం తెలిసింది. ఆమె భర్తను నిలదీయగా వివాదం జరిగింది. బాధితురాలు తన తల్లితో కలిసి పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పెనుమంట్రలో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కేసును పెరవలి స్టేషన్‌కు బదిలీ చేశారు.
News November 16, 2025
అది ఛేజ్ చేయగలిగే టార్గెటే: గంభీర్

టెస్టుల్లో ఆడాలంటే స్కిల్‌తో పాటు మెంటల్ టఫ్నెస్ ఉండాలని IND హెడ్ కోచ్ గంభీర్ అన్నారు. SAతో తొలి టెస్టులో <<18303459>>ఓటమి<<>> అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘124 ఛేజబుల్ టార్గెటే. పిచ్ ఆడేందుకు వీలుగానే ఉంది. ఇలాంటి పిచ్‌పై ఆడాలంటే టెక్నిక్, టెంపెరమెంట్ ఉండాలి. ఫాస్ట్ బౌలర్లకే ఎక్కువ వికెట్లు పడ్డాయి. మేం అడిగిన పిచ్‌నే క్యూరేటర్ తయారు చేశారు. బాగా ఆడనప్పుడు ఇలాగే జరుగుతుంది’ అని పేర్కొన్నారు.
News November 16, 2025
భారీ జీతంతో CSIR-SERCలో ఉద్యోగాలు

CSIR-స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ సెంటర్ (SERC) 30 సైంటిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 21 నుంచి డిసెంబర్ 22 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32 ఏళ్లు. ఎంపికైన వారికి నెలకు రూ.1,38,652 చెల్లిస్తారు. వెబ్సైట్: https://serc.res.in/


