News October 27, 2024

English Learning: Antonyms

image

✒ Abate× Aggravate
✒ Adhere× Condemn, disjoin
✒ Abolish× Setup, establish
✒ Acumen× Stupidity, ignorance
✒ Abash× Uphold, Discompose
✒ Absolve× Compel, Accuse
✒ Abjure× Approve, Sanction
✒ Abject× Commendable, Praiseworthy
✒ Abound× Deficient, Destitute

Similar News

News October 27, 2024

కొత్త టీచర్లకు జీతాల చెల్లింపు ప్రాతిపదిక ఇదే

image

TG: రాష్ట్రంలో కొత్తగా విధుల్లో చేరిన 10వేల మంది టీచర్లకు జీతాల చెల్లింపుపై నెలకొన్న సందిగ్ధతకు ప్రభుత్వం తెరదించింది. అపాయింట్‌మెంట్ ఆర్డర్ ఇచ్చిన ఈ నెల 10వ తేదీని ప్రాతిపదికగా తీసుకుంటామని తెలిపింది. టీచర్లు ఆ తేదీన విధుల్లో చేరి ఉండాలంది. కౌన్సెలింగ్ ఆలస్యమవడంతో ఆలస్యంగా రిపోర్టు చేసిన వారికి ఆయా తేదీల నుంచి జీతం ఇస్తామని పేర్కొంది.

News October 27, 2024

నేడు ఏపీ టెట్ ఫైనల్ కీ విడుదల

image

AP: ఈ నెల 3 నుంచి 21 వరకు జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్షల ఫైనల్ కీ నేడు విడుదల కానుంది. https://aptet.apcfss.in/ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నవంబర్ 2న తుది ఫలితాలను అధికారులు రిలీజ్ చేస్తారు. ఈసారి టెట్‌కు 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా 3,68,661 (86.28 శాతం) మంది హాజరయ్యారు.

News October 27, 2024

సంయమనం పాటించండి.. ఇరాన్-ఇజ్రాయెల్‌కు భారత్ సూచన

image

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ప్రతీకార దాడులపై భారత ప్రభుత్వం స్పందించింది. ‘పశ్చిమాసియాలో పరిణామాలను మేం పరిశీలిస్తున్నాం. ఇరు దేశాలు సంయమనం పాటించి దౌత్య మార్గాలపై దృష్టిసారించాలి. ఉద్రిక్తతలు, శత్రుత్వాలతో ఎవరికీ ప్రయోజనం ఉండదు. అమాయక పౌరులు, బందీలు బాధపడుతూనే ఉంటారు’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ ఓ ప్రకటన విడుదల చేశారు.