News September 20, 2024

ENGvsAUS: హెడ్ విధ్వంసం.. ఆసీస్ ఘన విజయం

image

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఆసీస్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 316 పరుగుల లక్ష్యాన్ని 44 ఓవర్లలోనే ఛేదించింది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అదరగొడుతున్న ట్రావిస్ హెడ్ మరోసారి సూపర్ ఇన్నింగ్స్ ఆడారు. 129 బంతుల్లో అజేయంగా 154 రన్స్(20 ఫోర్లు, 5 సిక్సర్లు) చేసి గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఇంగ్లండ్‌పై రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు. 2011లో వాట్సన్ 161* రన్స్ చేశారు.

Similar News

News September 20, 2024

నేటి నుంచి సివిల్స్ మెయిన్స్

image

నేటి నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామ్స్-2024 ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 20, 21, 22, 28, 29 తేదీల్లో దేశవ్యాప్తంగా పరీక్షలు నిర్వహిస్తారు. పేపర్ 1 ఉ.9 నుంచి మ.12 వరకు జరుగుతుంది. ఉ.8.30కు గేట్లు మూసేస్తారు. ఆ తర్వాత లోపలికి అనుమతించరు. హాల్ టికెట్, ఐడీ కార్డు కచ్చితంగా తీసుకెళ్లాలి. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలపై నిషేధం ఉంటుంది.

News September 20, 2024

అశ్విన్ సూపర్ సెంచరీ.. పలు రికార్డులు

image

BANపై సెంచరీ చేసిన అశ్విన్ పలు రికార్డులను సొంతం చేసుకున్నారు. ఒకే వేదికలో 2సెంచరీలు, పలుమార్లు 5+ వికెట్లు తీసుకున్న ఆటగాళ్ల జాబితాలో చేరారు. అశ్విన్ చెన్నైలో 2 సెంచరీలు, 4సార్లు 5 వికెట్లు తీశారు. సోబెర్స్ హెడ్డింగ్లీలో, కపిల్ చెన్నైలో, క్రెయిన్స్ ఆక్లాండ్‌లో, ఇయాన్ హెడ్డింగ్లీలో ఈ ఫీట్ చేశారు. అలాగే నం.8 లేదా దిగువన బ్యాటింగ్‌కు దిగి అత్యధిక సెంచరీలు(4) చేసిన రెండో ప్లేయర్‌గా అశ్విన్ నిలిచారు.

News September 20, 2024

పేజర్లు, వాకీటాకీలపై విమానాల్లో నిషేధం

image

పేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో వణికిపోతున్న లెబనాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తమ రాజధాని బీరుట్ నుంచి వెళ్లే విమానాల్లో వాటిని తీసుకెళ్లడంపై నిషేధం విధించింది. విమాన ప్రయాణికులందరినీ క్షుణ్ణంగా చెక్ చేయాలని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని పేర్కొంది. కాగా వాకీటాకీలు, పేజర్లు పేలుడు ఘటనల్లో 30 మందికి పైగా చనిపోగా, వేలాది మంది గాయపడ్డారు.