News December 20, 2024

మందిర్-మ‌సీదు వివాదాలు ఇక చాలు: భాగ‌వ‌త్‌

image

మందిర్-మ‌సీదు పేరుతో రోజుకో చోట వివాదాలు రేప‌డం ఇక ఎంత‌మాత్ర‌మూ కొన‌సాగ‌నివ్వ‌కూడ‌దని RSS చీఫ్ మోహ‌న్ భాగ‌వ‌త్ పున‌రుద్ఘాటించారు. రామ మందిరం నిర్మాణం త‌రువాత కొంద‌రు ఇలాంటి అంశాల‌ను లేవ‌నెత్తి లీడ‌ర్లు అవుదామ‌నుకుంటున్నార‌ని, ఇది ఆమోద‌యోగ్యం కాద‌ని స్పష్టం చేశారు. హిందువుల‌కు విశ్వాసం ఉన్నందున రామ మందిర నిర్మాణం జ‌రిగింద‌న్నారు. అందరం కలిసికట్టుగా జీవించగలమనే సందేశాన్ని భారత్ చాటాలన్నారు.

Similar News

News December 8, 2025

అరకు: ఎలుగుబంటి దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలు

image

అరకులోయ మండలం ఇరగాయి పంచాయతీ పరిధి ఉరుములులో ఎలుగుబంటి దాడిలో గిరిజనుడికి తీవ్ర గాయాలైన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. అప్పారావు గ్రామ సమీపంలోని కాఫీ తోటకి కాపలగా వెళ్లాడు. ఆదివారం అర్ధరాత్రి ఓ ఎలుగుబంటి అతనిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. క్షతగాత్రుడిని 108లో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఎలుగుబంట్లు పొలాల్లోకి రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

News December 8, 2025

మైసూరు పప్పు మాంసాహారమా?

image

పూజలు, వ్రతాల సమయంలో మైసూరు పప్పు తినకూడదంటారు. దీన్ని మాంసాహారంగా కూడా కొందరు భావిస్తారు. ఇందులో బద్ధకాన్ని కలిగించే తామస గుణాలుండటం అందుకు తొలి కారణం. అలాగే ఓ రాక్షసుడి రక్తం బొట్టు నుంచి ఈ పప్పు పుట్టిందని కొందరు పండితులు పేర్కొంటారు. పాల సముద్రాన్ని చిలకగా వచ్చిన అమృతాన్ని దొంగచాటుగా తాగిన సర్భాను తలను విష్ణు సుదర్శన చక్రంతో ఖండించాడట. ఆ రక్తపు చుక్కలు పడిన చోట ఇవి మొలిచాయని నమ్ముతారు.

News December 8, 2025

ఫైబ్రాయిడ్స్ లక్షణాలివే..

image

ఫైబ్రాయిడ్స్‌ ఉన్న మహిళల్లో నెలసరి స్రావంలో రక్తపు గడ్డలు కనిపించడం, నొప్పి ఉంటాయి. ఒకవేళ ఫైబ్రాయిడ్స్‌ చాలా పెద్దవిగా ఉంటే మూత్రాశయం మీద ఒత్తిడి పడి తరచూ మూత్రవిసర్జన చేయవలసి రావడం, మూత్రవిసర్జన పూర్తిగా జరగకపోవడం, జీర్ణ సమస్యలు వంటివి మొదలవుతాయి. కొన్ని రకాల ఫైబ్రాయిడ్లు గర్భసంచి లోపలి పొరల్లో ఏర్పడతాయి. వీటి వల్ల గర్భస్రావం జరిగిపోవడం, గర్భం దాల్చలేకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి.