News July 10, 2025
EP-3: ఇలా చేస్తే వివాహ బంధం బలపడుతుంది: చాణక్య నీతి

వివాహ బంధం బలపడాలంటే దంపతులు ఎలా నడుచుకోవాలో చాణుక్యుడు వివరించారు. ఇద్దరూ కోపం తగ్గించుకోవాలి. పరస్పరం గౌరవించుకోవాలి. అన్ని విషయాలను చర్చించుకోవాలి. కష్టసుఖాలను పంచుకోవాలి. ఒకరితో ఒకరు అబద్ధాలు చెప్పుకోకూడదు. మంచైనా/చెడైనా హేళన చేసుకోకూడదు. నేనే గొప్ప అనే అహం భావాన్ని పక్కన పెట్టి అన్ని పనుల్లో పరస్పరం సహకరించుకోవాలి.
<<-se>>#chanakyaneeti<<>>
Similar News
News July 10, 2025
రక్తపోటును తగ్గించే ఔషధం!

జీవనశైలి మార్పులతో చాలా మంది హైబీపీతో బాధపడుతున్నారు. అయితే శ్వాస వ్యాయామం ద్వారా రక్తపోటును తగ్గించొచ్చని వైద్యులు చెబుతున్నారు. నిమిషానికి ఆరుసార్లు శ్వాస తీసుకోవడం/వదలడం చేస్తే నాడీ వ్యవస్థ, BPని నార్మల్‌కు తీసుకురావొచ్చంటున్నారు. నార్మల్ కేసుల్లో జీవనశైలి & శ్వాస పద్ధతుల ద్వారా మందుల అవసరాన్ని తగ్గించొచ్చని తెలిపారు. 10-20 ని.లకు ఒక సెషన్‌గా రోజులో 3 నుంచి 4 సార్లు ఇది ప్రాక్టీస్ చేయాలన్నారు.
News July 10, 2025
తెలంగాణ లేకుండా చిత్రపటం బహూకరించారు: BRS MLC

ఏపీ నాయకులు తెలంగాణ రాష్ట్ర గుర్తింపును తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని BRS MLC శ్రవణ్ ఆరోపించారు. మంత్రి లోకేశ్‌కు AP BJP చీఫ్ మాధవ్ తాజాగా భారతదేశ చిత్రపటాన్ని బహూకరించారు. ఇందులో TGని ప్రత్యేకంగా చూపకుండా ఉమ్మడి APని చూపించారని శ్రవణ్ మండిపడ్డారు. ‘ఇది TG గుర్తింపుపై AP నేతలు చేస్తున్న రాజకీయ కుట్రను సూచిస్తోంది’ అని ట్వీట్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని TG DGPని కోరారు.
News July 10, 2025
ప్రభాస్ న్యూ లుక్.. పిక్ వైరల్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కొత్త లుక్‌లో కనిపించారు. డార్లింగ్ న్యూ లుక్ వావ్ అనేలా ఉంది. ‘రాజాసాబ్’ సెట్స్‌లో నిర్మాత ఎస్కేఎన్‌కు ఆయన బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోను ఎస్కేఎన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ డార్లింగ్ లేటెస్ట్ లుక్‌కు ఫిదా అవుతున్నారు. కాగా మారుతి-ప్రభాస్ కాంబోలో వస్తున్న ‘రాజాసాబ్’ మూవీ డిసెంబర్ 5న విడుదల కానుంది.