News August 13, 2025
EP34: ఈ 5 లక్షణాలు వదిలేస్తే మీరే విజేతలు: చాణక్య నీతి

ఎలాంటి వ్యక్తి జీవితంలో విజయం సాధిస్తాడో చాణక్య నీతి వివరించింది. ఈ 5 లక్షణాలను వదులుకుంటే కచ్చితంగా విజయం వరిస్తుందని పేర్కొంది.
*అందరినీ సంతృప్తి పరచాలి అనుకోవడం
*అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం
*నిన్ను నువ్వే కించ పరుచుకోవడం
*మార్పునకు భయపడటం
*గతంలోనే జీవించడం <<-se>>#Chanakyaneeti<<>>
Similar News
News August 13, 2025
వచ్చే నెల ట్రంప్‌తో మోదీ భేటీ?

PM మోదీ వచ్చే నెల USలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. న్యూయార్క్‌లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ(UNGA) సమ్మిట్‌లో భాగంగా SEP 23 నుంచి జరిగే హైలెవల్ మీటింగ్‌లో PM పాల్గొంటారని సమాచారం. ఆ సమయంలో US ప్రెసిడెంట్ ట్రంప్‌ని కలిసి ట్రేడ్ డీల్, టారిఫ్స్‌పై చర్చించే అవకాశముంది. అలాగే ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీని కూడా PM కలవొచ్చని జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి.
News August 13, 2025
‘నవోదయ’లో ప్రవేశాలు.. నేడే చివరి తేదీ

దేశ వ్యాప్తంగా 654 జవహర్ నవోదయ విద్యాలయాల్లో(JNV) ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఇవాళే చివరి తేదీ. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు ఇటీవలే గడువు ముగియగా విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా మళ్లీ పొడిగించారు. ఆసక్తి ఉన్నవారు ఇక్కడ <
News August 13, 2025
ఏపీలో అతి భారీ వర్షాలు.. సెలవులు ఇస్తారా?

AP: రాష్ట్రంలో ఇవాళ, రేపు అతి భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కాగా అతి భారీ వర్షాల నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులివ్వాలని పలువురు కోరుతున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో స్కూళ్లకు 2 రోజులు సెలవులిచ్చిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.