News November 11, 2024
EPFO: ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పనున్న కేంద్రం?
EPFO గరిష్ఠ వేతన పరిమితిని రూ.15వేల నుంచి రూ.21వేలకు పెంచేందుకు కేంద్రం యోచిస్తున్నట్లు ‘ఎకనామిక్ టైమ్స్’ వెల్లడించింది. సాధారణంగా ఉద్యోగి వాటాగా వేతనంపై 12%, యజమాని వాటా 12% చెల్లిస్తారు. వేతన పరిమితి పెంచడం వల్ల ఉద్యోగుల భవిష్య నిధికి జమయ్యే మొత్తం ఆ మేరకు పెరగనుంది. చివరిసారిగా 2014లో రూ.6,500గా ఉన్న వేజ్ సీలింగ్‌ను రూ.15వేలకు కేంద్రం పెంచింది.
Similar News
News November 13, 2024
ఇది ప్రజలను మభ్యపెట్టే బడ్జెట్: జగన్
AP:పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే చంద్రబాబు మోసాలు బయటకొస్తాయనే భయంతోనే ఇన్ని నెలల పాటు బడ్జెట్ ప్రవేశపెట్టలేదని YCP చీఫ్ జగన్ ఆరోపించారు. ‘ఇప్పుడు కూడా ప్రజలను మభ్యపెట్టేలా బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరం ఇంకా 4 నెలలు మాత్రమే ఉంటే ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇచ్చిన హామీలపై చిత్తశుద్ధి ఉంటే బడ్జెట్‌లో ఆమేరకు నిధులు కేటాయించేవారు. ప్రజలను మోసం చేసేలా బడ్జెట్ ఉంది’ అని మండిపడ్డారు.
News November 13, 2024
SENSEX 2 నెలల్లో 8000 పాయింట్లు డౌన్.. WHAT NEXT?
స్టాక్‌మార్కెట్లు బేరు బేరుమంటున్నాయి. జీవితకాల గరిష్ఠం నుంచి BSE సెన్సెక్స్ 2 నెలల్లోనే 8300 పాయింట్లు నష్టపోయింది. NSE నిఫ్టీ 26277 నుంచి 10% తగ్గింది. సూచీలు 20% తగ్గితే బేర్స్ గ్రిప్‌లోకి వెళ్లినట్టు భావిస్తారు. నిఫ్టీ 200 DMAను టచ్ చేయడం టెన్షన్ పెడుతోంది. ఇప్పటికే ₹1000Cr MCap మీదున్న 900 స్టాక్స్ 20% క్రాష్ అవ్వడంతో బేర్ మార్కెట్లోకి ఎంటరవుతున్నామని ఇన్వెస్టర్లు నిరాశ చెందుతున్నారు.
News November 13, 2024
స్కూళ్లకు కీలక ఆదేశాలు
AP: నవంబర్ 14న అన్ని స్కూళ్లల్లో నిర్వహించాల్సిన మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ వాయిదా పడింది. ఈ మేరకు అన్ని స్కూళ్లకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ మొదటివారంలో ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తామని పేర్కొంది. త్వరలోనే కొత్త తేదీ, ఇతర వివరాలను వెల్లడిస్తామని చెప్పింది.