News May 7, 2025

ఖాతాదారులకు EPFO గుడ్‌న్యూస్

image

ఖాతాదారులు తమ PF అకౌంట్లను సులభంగా ట్రాన్స్‌ఫర్ చేసుకునేందుకు వీలుగా EPFO కీలక నిర్ణయం తీసుకుంది. రివాంప్డ్ 13 సాఫ్ట్‌వేర్ ఫంక్షనాలిటీని అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపింది. అంటే గతంలో లాగా పాత కంపెనీ నుంచి కొత్త కంపెనీకి అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయాలంటే రెండు కంపెనీలూ ఆమోదం తెలపాల్సిన అవసరం లేదు. పాత కంపెనీ ఆమోదం తెలపగానే ఆటోమేటిక్‌గా ప్రస్తుత కంపెనీ ఖాతాకు బదిలీ అవుతుందని స్పష్టం చేసింది.

Similar News

News March 29, 2026

ఎన్టీఆర్, చిరు, PK బాటలోనే విజయ్!

image

TN అసెంబ్లీ ఎన్నికల్లో TVK అధినేత విజయ్ రెండు చోట్ల పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ బాటలోనే ఆయన నడుస్తున్నారని SMలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఎన్టీఆర్ TDPని స్థాపించి 1983లో గుడివాడ, తిరుపతి నుంచి పోటీ చేసి రెండు చోట్లా గెలిచారు. చిరంజీవి(ప్రజారాజ్యం) 2009లో తిరుపతి(విజయం), పాలకొల్లులో(ఓటమి) పోటీ చేశారు. పవన్(జనసేన) 2019లో గాజువాక, భీమవరంలో పోటీ చేసి ఓడారు.

News March 29, 2026

KKRvsMI.. వాంఖడే పిచ్ రిపోర్ట్ ఇదే

image

ఇవాళ రాత్రి ముంబైలోని వాంఖడే <<19504194>>వేదికగా<<>> KKR, MI మ్యాచ్ జరగనుంది. ఈ గ్రౌండ్ పిచ్‌ బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉంటుంది. బ్యాటర్లు స్వేచ్ఛగా అన్నివైపులా పరుగులు చేసే వీలుంటుంది. ఫాస్ట్ బౌలర్లు ఆరంభంలో కాస్త స్వింగ్ రాబట్టవచ్చు. మ్యాచ్ జరిగే కొద్దీ స్పిన్నర్లు ప్రభావం చూపవచ్చు. సాధారణంగా ఇక్కడ టాస్ గెలిచిన జట్లు Dew కారణంగా ఛేజింగ్‌ను ఇష్టపడతాయి.
* ఇవాళ ఏ టీమ్ గెలుస్తుందో కామెంట్ చేయండి.

News March 29, 2026

అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యుల సస్పెండ్

image

TG: అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యులను స్పీకర్ గడ్డం ప్రసాద్ రెండు రోజులపాటు సస్పెండ్ చేశారు. ఇవాళ, రేపు సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే సభలో కడియం శ్రీహరి పట్ల <<19506649>>కౌశిక్ రెడ్డి<<>> వ్యవహరించిన తీరుపై ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది. కౌశిక్ వ్యవహార శైలిని సమర్థిస్తే అసెంబ్లీలో కత్తిపోట్లు జరుగుతాయని, ఇలాంటి ఘటనలను సీరియస్‌గా తీసుకోవాలని సీఎం రేవంత్ అన్నారు.