News October 8, 2025

EPFO కనీస పింఛన్ రూ.2,500కు పెంపు?

image

ఈపీఎఫ్‌వో చందాదారులకు కనీస పింఛన్ రూ.2,500కు పెంచనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 10, 11న ట్రస్టీల భేటీలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పింఛను పెంపుపై నిర్ణయం తీసుకుంటే కేంద్రం ఆమోదించాల్సి ఉంటుంది. మరోవైపు రూ.7,500 ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం నెలకు రూ.1,000 పింఛన్ అందుతోంది. 10 ఏళ్ల రెగ్యులర్ సర్వీసు, 58 ఏళ్లు పూర్తి చేసుకున్న వారు ఇందుకు అర్హులు.

Similar News

News October 8, 2025

భారీగా పెరిగిన బంగారం ధరలు

image

బంగారం ధరలు క్రమంగా పెరుగుతూ కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,150 పెరిగి తొలిసారి రూ.1,23,170కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.1,050 ఎగబాకి రికార్డు స్థాయిలో రూ.1,12,900 పలుకుతోంది. అటు KG వెండి ధర రూ.100 తగ్గి రూ.1,67,000కి చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News October 8, 2025

కాంతార చాప్టర్-1కు రూ.400 కోట్ల కలెక్షన్లు

image

గత గురువారం విడుదలైన ‘కాంతార చాప్టర్-1’ భారీ కలెక్షన్లు రాబడుతోంది. ఇప్పటివరకు రూ.400 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది ఈ మార్క్ అందుకున్న నాలుగో సినిమాగా (సైయారా, ఛావా, కూలీ) నిలిచింది. నెట్ కలెక్షన్లు రూ.290 కోట్లుగా ఉండొచ్చని, ఇవాళ్టితో హిందీ మార్కెట్లో రూ.100 కోట్ల నెట్ దాటుతుందని అంచనా వేస్తున్నారు. తెలుగులో రూ.57.40 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి.

News October 8, 2025

సరైన భాగస్వామి దొరికే వరకు ఎదురుచూడటంలో తప్పులేదు: ఉపాసన

image

NCRB ప్రకారం భారత్‌లో సగం నేరాలకు వైవాహిక సమస్యలు కూడా కారణమంటున్నారు ఉపాసన. కాబట్టి పెళ్లి విషయంలో మహిళల ఆలోచనా తీరుమారాలని సూచిస్తున్నారు. భాగస్వామి ఎంపికలో సరైన నిర్ణయమే మహిళ భవిష్యత్తుకి, మంచి కుటుంబాన్ని నిర్మించడానికి కీలకమన్నారు. డబ్బు, హోదా కోసం పెళ్లి చేసుకోకూడదని, మీకు గౌరవమిస్తూ అన్ని విషయాల్లో అండగా నిలిచే వ్యక్తి కోసం ఎదురుచూడటంలో తప్పులేదని ఓ పోస్టులో పేర్కొన్నారు.