News June 11, 2024
EPFO: కేవైసీ ఉంటే చెక్ అవసరం లేదు!

ఉద్యోగుల క్లెయిమ్‌లు తిరస్కరణకు గురికాకుండా ఈపీఎఫ్‌వో మరో వెసులుబాటు కల్పించింది. చందాదారుడి బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఈకేవైసీ పూర్తయితే క్లెయిమ్ సమయంలో చెక్, పాస్‌బుక్ కాపీలు జత చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈమేరకు క్లెయిమ్ దరఖాస్తు సమయంలో నోట్ కనిపిస్తుందని తెలిపింది. దీంతో ఈపీఎఫ్ క్లెయిమ్‌లు సత్వరం పరిష్కారం అవుతాయని సంస్థ భావిస్తోంది.
Similar News
News January 1, 2026
ఇవాళ బంగారం, వెండి ధరలెలా ఉన్నాయంటే?

న్యూఇయర్ వేళ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఇవాళ రూ.170 పెరిగి రూ.1,35,060కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.150 ఎగబాకి రూ.1,23,800 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.1,000 తగ్గి రూ.2,56,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News January 1, 2026
చేపల్లో శంకుపూత వ్యాధి – నివారణకు సూచనలు

తెల్ల చేపల్లో శంకుపూత వ్యాధి శీతాకాలంలో వస్తుంది. దీని వల్ల చేపల ఎదుగుదల లోపిస్తోంది. దీని నివారణకు ఎకరా చేపల చెరువులో 80-100 kgల ఉప్పును చల్లాలని మత్స్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. వ్యాధి ఉద్ధృతి ఎక్కువగా ఉంటే ఎకరా చేపల చెరువుకు కాపర్ సల్ఫేట్ ఒక KG చల్లాలి. చేపల పెరుగుదల బాగుండాలంటే ఎకరాకు పిల్లల మోతాదు 3 వేలకు మించకూడదు. 100KGల తవుడుకు 30-40KGల చెక్క కలిపి మేతగా ఇస్తే చేపల పెరుగుదల బాగుంటుంది.
News January 1, 2026
Stock Market: కొత్త ఏడాదికి లాభాలతో స్వాగతం

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు కొత్త సంవత్సరాన్ని లాభాలతో ప్రారంభించాయి. నిఫ్టీ 53 పాయింట్ల లాభంతో 26,183 వద్ద.. సెన్సెక్స్ 170 పాయింట్లు పెరిగి 85,391 దగ్గర ట్రేడవుతోంది. సెన్సెక్స్-30 సూచీలో M&M, ఎటర్నల్, రిలయన్స్, L&T, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభాల్లో.. ITC, BEL, బజాజ్ ఫైనాన్స్, సన్‌ఫార్మా, ట్రెంట్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.


