News January 6, 2025
EPFO పెన్షన్ను రూ.5వేలకు పెంచాలి: ట్రేడ్ యూనియన్లు

ఆదాయపు పన్ను పరిమితిని రూ.10 లక్షలు చేయాలని కేంద్రాన్ని ట్రేడ్ యూనియన్ల ప్రతినిధులు డిమాండ్ చేశారు. బడ్జెట్ సన్నాహక సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలతో వారు భేటీ అయ్యారు. గిగ్ వర్కర్లు, వ్యవసాయ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. EPFO పెన్షన్ను రూ.1,000 నుంచి రూ.5వేలకు పెంచాలని సూచించారు. ప్రైవేటీకరణను ఆపాలని విజ్ఞప్తి చేశారు.
Similar News
News January 24, 2026
స్కాట్లాండ్కు గోల్డెన్ ఛాన్స్

T20 వరల్డ్కప్లో స్కాట్లాండ్కు అదృష్టం కలిసి వచ్చింది. భద్రతా కారణాల సాకుతో భారత్కు రావడానికి బంగ్లాదేశ్ నిరాకరించడంతో ICC ఆ జట్టును తప్పించింది. దీంతో అత్యధిక ర్యాంకింగ్ ఉన్న <<18945385>>స్కాట్లాండ్<<>>కు అవకాశం దక్కింది. గ్రూప్ సీలో ఇంగ్లండ్, వెస్టిండీస్, నేపాల్, ఇటలీతో తలపడనుంది. దీంతో స్కాట్లాండ్ మంచి ప్రదర్శన కనబరిస్తే టాప్-8కు చేరే ఛాన్స్ ఉంది. ఇది ఆ దేశానికి వరుసగా ఐదో T20 WC కావడం విశేషం.
News January 24, 2026
రేపు రథ సప్తమి.. ఇలా చేయండి

రథ సప్తమిని సూర్య జయంతి అని కూడా పిలుస్తారు. రేపు సూర్యుడు ఉత్తరాయణ మార్గంలో ప్రయాణం ప్రారంభిస్తాడని పురాణాలు చెబుతాయి. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానం చేస్తే శుభకరమని పండితులు చెబుతున్నారు. సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తూ ఓం సూర్యాయ నమః మంత్రాన్ని జపించాలి. బియ్యం, గోధుమలు, బెల్లం, గోధుమ పిండి, దుస్తులు దానం చేస్తే శుభాలనిస్తుంది. మాంసాహారం, మద్యం సేవించకూడదు. కోపం, చెడు మాటలకు దూరంగా ఉండాలి.
News January 24, 2026
మున్సిపల్ ఎన్నికలకు BRS ఇన్ఛార్జుల నియామకం

TG: త్వరలో ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సమన్వయకర్తలను నియమించారు. ప్రతి మున్సిపాలిటీకి ఒక సీనియర్ నాయకుడు ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తారు. వీరు అభ్యర్థుల ఎంపిక, శ్రేణులను సమన్వయం చేయడం, ప్రచార వ్యూహాలను రచిస్తారు. ఎన్నికల సరళిని ఎప్పటికప్పుడు పార్టీ కేంద్ర కార్యాలయానికి తెలియజేస్తారు. ప్రజల మద్దతుతో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని శ్రేణులకు KTR పిలుపునిచ్చారు.


