News October 14, 2025

EPFO: ఆ నిబంధన ఎత్తివేత!

image

<<17996798>>EPFO<<>> మరిన్ని నిర్ణయాలు..
* చదువు కోసం 10, పెళ్లి విషయంలో 5సార్లు పాక్షిక విత్ డ్రా చేసుకోవచ్చు. గతంతో వీటిపై పరిమితి(3 సార్లు) ఉండేది.
* విత్ డ్రా చేయడానికి గతంలో ప్రకృతి విపత్తు, నిరుద్యోగం తదితర కారణాలు చూపాల్సి వచ్చేది. ప్రస్తుతం ఆ నిబంధన ఎత్తేశారు.
* కనీస బ్యాలెన్స్ 25% కచ్చితంగా కొనసాగించాలి. దాంతో అధిక వడ్డీ రేటు పొందే వీలుంటుంది.
* విత్ డ్రా కోసం కనీస సర్వీస్ కాలాన్ని 12 నెలలకు తగ్గించారు.

Similar News

News October 14, 2025

మోదీ టూర్.. కర్నూలులో 10 మంది మంత్రుల మకాం!

image

AP: ప్రధాని మోదీ కర్నూలు సభ విజయవంతం చేసేందుకు, జన సమీకరణకు 10 మంది మంత్రులు అక్కడే మకాం వేశారు. 16న జరిగే సభకు 7,500 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. PM పర్యటించే ప్రాంతాల్లో 200 CC కెమెరాలు ఏర్పాటు చేశారు. నేటి నుంచి 16 వరకు డ్రోన్ల ఎగరవేతపై ఆయా ప్రాంతాల్లో నిషేధం విధించారు. ప్రధాని సభకు వెళ్లేవారి కోసం దాదాపు 8వేల బస్సులు సమకూరుస్తున్నట్లు సమాచారం.

News October 14, 2025

మీరు విన్న, కొన్న ది బెస్ట్ లోయెస్ట్ రేట్ ఏంటి?

image

బంగారం.. మున్ముందు ఈ పేరూ పలుకే బంగారమాయెనా అనేలా పచ్చ లోహం ధరలున్నాయి. ఇన్నాళ్లూ 24క్యారెట్ల 10గ్రా. పసిడి రూ.1 లక్ష పైన కొనసాగగా ఇప్పుడు పన్నులతో కలిపి 18 క్యారెట్లూ ఒక లకారం దాటుతోంది. ఇప్పుడు సామాన్యుడు గోల్డ్ గురించి మాట్లాడుకోవడమే కానీ టైమ్ ట్రావెల్‌లో ధర తక్కువ ఉన్న గోల్డెన్ డేస్‌కు వెళ్లి కొనలేడు. మీరు ఎంత తక్కువ రేటుకు స్వర్ణం కొన్నారు. లేదా మీ వాళ్లు చెబుతుంటే విన్నారు? కామెంట్ చేయండి.

News October 14, 2025

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

image

దీపావళి ముంగిట బంగారం, వెండి ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 3,280 పెరిగి రూ.1,28,680కు చేరింది. 10 రోజుల్లోనే రూ.9,280 పెరగడం గమనార్హం. 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.3,000 పెరిగి రూ.1,17,950గా ఉంది. అలాగే కేజీ వెండిపై రూ.9,000 ఎగబాకి తొలిసారి రూ.2,06,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.