News March 27, 2024
కాంగ్రెస్ MP అభ్యర్థుల జాబితాలో పొరపాటు
కాంగ్రెస్ ప్రకటించిన MP అభ్యర్థుల జాబితాలో పొరపాటు చోటు చేసుకుంది. ఆదిలాబాద్ స్థానం నుంచి ఆత్రం సుగుణ పేరు ప్రకటించాల్సి ఉండగా.. డా.సుగుణ కుమారి చెలిమల పేరును ప్రకటించింది. అయితే.. ఆత్రం సుగుణ పేరును మంత్రి సీతక్క ఖరారు చేశారు. ఆమెకు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేసిన సుగుణ ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు.
Similar News
News November 5, 2024
భారత్ బ్రాండ్: రూ.30కే గోధుమ పిండి, రూ.34కే బియ్యం
కేంద్రం భారత్ బ్రాండ్ రెండో దశను ఆవిష్కరించింది. కాస్త ధరలు పెంచి రూ.30కే కేజీ గోధుమ పిండి, రూ.34కే KG బియ్యం వినియోగదారులకు ఇవ్వనుంది. 5-10 KGల బ్యాగులను NCCF, కేంద్రీయ భండార్, ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్స్ ద్వారా అమ్మనుంది. వినియోగదారులకు తాత్కాలిక ఉపశమనం కల్పించేందుకు దీనిని అమలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఫేజ్-1లో రూ.27.50కే కేజీ గోధుమ పిండి, రూ.29కే కిలో బియ్యం అందించింది.
News November 5, 2024
US Elections: డిక్స్‌విల్లే నాచ్‌లో తొలి ఫలితం
న్యూ హ్యాంప్‌షైర్‌లోని డిక్స్‌విల్లే నాచ్‌లో పోలింగ్ ముగిసింది. తొలి ఫలితం కూడా వచ్చేసింది. అర్హులైన ఓటర్లు అతితక్కువగా ఉండే ఈ ప్రాంతంలో 1960 నుంచి మిగిలిన రాష్ట్రాల కంటే ముందే పోలింగ్ జరుగుతోంది. ఈ ఫలితాల్లో కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్‌నకు చెరో మూడు చొప్పున బ్యాలెట్ ఓట్లు దక్కాయి. యూఎస్-కెనడా సరిహద్దులోని ఈ పట్టణ ప్రజలు గత రెండు అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్లకు మద్దతు ఇచ్చారు.
News November 5, 2024
నవంబర్ 25 నుంచి పార్లమెంటు సమావేశాలు
పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 25వ తేదీ నుంచి డిసెంబర్ 20 వరకు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఈ సమావేశాల్లో ప్రధానంగా వక్ఫ్ సవరణ బిల్లు సహా దేశంలో జమిలి ఎన్నికల బిల్లు సభ ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే నవంబర్ రెండో వారంలో పలు లోక్‌సభ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరగనుండడంతో కొత్త సభ్యుల ప్రమాణం కూడా ఉంటుంది.