News January 18, 2025

చావు నుంచి తప్పించుకున్నా.. కానీ: షేక్ హసీనా

image

గత ఏడాది ఆగస్టులో నిరసనకారులు తనను, చెల్లెలిని చంపబోయారని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా వెల్లడించారు. ఆ రోజు నుంచి భారత్‌లో ఆశ్రయం పొందుతున్న ఆమె తాజాగా ఓ ఆడియో క్లిప్ విడుదల చేశారు. కేవలం 20-25 నిమిషాల వ్యవధిలో చావు నుంచి తప్పించుకున్నామని చెప్పారు. ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే దేవుడు తనను ప్రాణాలతో ఉంచారన్నారు. అయితే తన ఇంట్లో ఉండే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News

News January 19, 2025

వైసీపీలో నియామకాలు.. చోడవరానికి అమర్నాథ్, భీమిలికి శ్రీను

image

AP: పలు నియోజకవర్గాలకు వైసీపీ నూతన సమన్వయకర్తలను నియమించింది. చోడవరానికి గుడివాడ అమర్నాథ్, మాడుగులకు బూడి ముత్యాలనాయుడు, భీమిలికి మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను), గాజువాకకు తిప్పల దేవన్ రెడ్డి, పి.గన్నవరానికి గన్నవరపు శ్రీనివాసరావును నియమించింది. అలాగే అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకులుగా కరణం ధర్మశ్రీని, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వరికూటి అశోక్‌బాబుకు బాధ్యతలు అప్పగించింది.

News January 19, 2025

మాంసంలో నిమ్మ రసం పిండుకుంటున్నారా?

image

మాంసం కూర తినేటప్పుడు చాలా మంది నిమ్మరసం పిండుకుంటారు. దీనివల్ల రుచితోపాటు పలు ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆ రసంలోని విటమిన్-C వల్ల జీర్ణక్రియ వేగవంతం అవుతుందని, రోగనిరోధక శక్తి పెరుగుతుందని పేర్కొంటున్నారు. హానికరమైన బ్యాక్టీరియా ఉంటే నాశనమవుతుందని, నిమ్మలోని సిట్రస్ యాసిడ్లు కూరకు రుచి మృదుత్వాన్ని చేకూరుస్తాయని అంటున్నారు. అయితే ఆ రసం మోతాదుకు మించొద్దని సూచిస్తున్నారు.

News January 18, 2025

సెమీ ఫైనల్స్‌లో సాత్విక్-చిరాగ్ శెట్టి ఓటమి

image

ఇండియా ఓపెన్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నీలో మెన్స్ డబుల్స్ జంట సాత్విక్-చిరాగ్ శెట్టి పోరాటం ముగిసింది. సెమీ ఫైనల్స్‌లో మలేషియా జోడీ గోహ్ స్జెఫీ-నూర్ ఇజ్జుద్దీన్‌ 21-18, 21-14 తేడాతో గెలిచింది. కేవలం 37 నిమిషాల్లోనే మ్యాచ్ ముగిసింది. ఇప్పటికే పీవీ సింధు కూడా ఓడిపోయిన విషయం తెలిసిందే. క్వార్టర్ ఫైనల్లో ఇండోనేషియా ప్లేయర్ గ్రెగోరియా 21-9, 19-21, 21-17 తేడాతో గెలిచారు.