News May 3, 2024

ఈనెల 6న ఈసెట్‌.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

image

TG: ఈనెల 6న జరగనున్న ఈసెట్ ప్రవేశ పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను అనుమతించబోమని అధికారులు తెలిపారు. ఉ.9 నుంచి మ.12 వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షను నిర్వహిస్తామని, పరీక్ష సమయానికి గంట ముందే విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకోవాలని సూచించారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, డిజిటల్ వాచ్‌లు, ఫోన్లకు అనుమతి ఉండదని, హాల్ టికెట్‌తో పాటు ఏదైనా ఐడీ కార్డు వెంట తెచ్చుకోవాలని పేర్కొన్నారు.

Similar News

News January 7, 2026

గాయం నుంచి కోలుకొని అదరగొట్టిన శ్రేయస్

image

భారత స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ VHTలో అదరగొట్టారు. గాయం నుంచి కోలుకున్న తర్వాత నిన్న ముంబై కెప్టెన్‌గా తొలి మ్యాచ్ ఆడిన ఆయన 53 బంతుల్లోనే 82 రన్స్ చేశారు. అందులో 10 ఫోర్లు, 3 సిక్సులున్నాయి. దీంతో ఈ నెల 11 నుంచి NZతో ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌లో శ్రేయస్ ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకోవడం ఖాయమైనట్లే. గతేడాది AUSలో వన్డే మ్యాచ్ ఆడుతూ గాయపడిన శ్రేయస్ 2 నెలల పాటు ఆటకు దూరమైన విషయం తెలిసిందే.

News January 7, 2026

రష్యా నుంచి భారత్ దిగుమతులు రూ.17లక్షల కోట్లు

image

ఉక్రెయిన్‌తో పూర్తిస్థాయి యుద్ధం మొదలైన నాటి నుంచి సుమారు రూ.15 లక్షల కోట్ల విలువైన చమురు, రూ.1.91 లక్షల కోట్ల విలువైన బొగ్గు రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకున్నట్టు సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ అంచనా వేసింది. చైనాకు 293.7 బిలియన్ యూరోల విలువైన చమురు, గ్యాస్, బొగ్గును రష్యా అమ్మింది. 2022 నుంచి ప్రపంచ శిలాజ ఇంధన అమ్మకాలతో రష్యా రూ.85-95 లక్షల కోట్లు సంపాదించినట్లు పేర్కొంది.

News January 7, 2026

జనవరి 07: చరిత్రలో ఈరోజు

image

* 1935: కలకత్తాలో భారత జాతీయ సైన్సు అకాడమీని నెలకొల్పారు.
* 1938: నటి బి.సరోజాదేవి జననం
* 1950: సామాజిక సేవకురాలు, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత శాంతా సిన్హా జననం
* 1967: బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ జననం (ఫోటోలో)
* 1979: బాలీవుడ్ నటి బిపాషా బసు పుట్టినరోజు
* 2008: జైపూర్ ఫుట్ (కృత్రిమ పాదం) సృష్టికర్త ప్రమోద్ కరణ్ సేథీ మరణం