News November 30, 2024
అమరావతిలో ESI ఆస్పత్రి, మెడికల్ కాలేజీ: మంత్రి
AP: అమరావతిలో భారీ స్థాయిలో ESI ఆస్పత్రి, మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 20 ఎకరాల స్థలం కేటాయింపునకు క్యాబినెట్ సబ్ కమిటీ ఆమోదం తెలిపిందని మంత్రి నారాయణ చెప్పారు. అలాగే L&T, IGNOU, CITD, బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, బ్రహ్మకుమారి ఎడ్యుకేషన్ సొసైటీలకు స్థలాలు కేటాయించామన్నారు. వచ్చే జనవరి నుంచి రాజధానిలో నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు.
Similar News
News November 30, 2024
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనానికి 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 62,417 మంది భక్తులు దర్శించుకోగా 23,096 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో హుండీ ఆదాయం రూ.3.77 కోట్లు చేకూరింది.
News November 30, 2024
వికారాబాద్ జిల్లాలో ఇండస్ట్రియల్ పార్క్.. భూసేకరణకు నోటిఫికేషన్
TG: వికారాబాద్ జిల్లాలో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దుద్యాల మండలం పోలేపల్లిలో ఈ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం లగచర్లలో 110.32 ఎకరాలు, పోలేపల్లిలో 71.39 ఎకరాల భూమిని సేకరించనుంది. కాగా లగచర్లలో ఫార్మా విలేజ్ కోసం గతంలో ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ను ప్రభుత్వం నిన్న రద్దు చేసింది.
News November 30, 2024
YS జగన్ ఫొటో మార్ఫింగ్.. కేసు పెడతామని TDPకి అంబటి హెచ్చరిక
AP: మాజీ సీఎం జగన్ ఫొటోను మార్ఫింగ్ చేసి టీడీపీ సోషల్ మీడియాలో అకౌంట్లో పోస్టు <