News February 27, 2026

ESIC కాన్పూర్‌లో జూనియర్ ఇంజినీర్ పోస్టులు

image

ESIC కాన్పూర్‌లో 4 జూనియర్ ఇంజినీర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ/డిప్లొమా( సివిల్, ఎలక్ట్రికల్) ఉత్తీర్ణులు అర్హులు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.33,630 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://esic.gov.in

Similar News

News March 2, 2026

మేం యుద్ధాన్ని స్టార్ట్ చేయలేదు కానీ ముగిస్తాం: US

image

ఇరాన్‌తో యుద్ధాన్ని తాము మొదలు పెట్టలేదని, కానీ ముగించేది మాత్రం తామేనని అమెరికా డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సేత్ అన్నారు. ఇరాన్‌పై జరిగిన ఏరియల్ ఆపరేషన్ చరిత్రలో అత్యంత సంక్లిష్టమైన, కచ్చితమైనదని పేర్కొన్నారు. ‘ఇరాన్ వంటి ప్రభుత్వాలు అణ్వాయుధాలు కలిగి ఉండకూడదు. అమెరికన్లను చంపే/బెదిరించే ఎవరినైనా వేటాడుతాం. ఇది అంతులేని యుద్ధంగా మారదు. కానీ ఇరాన్‌లో ప్రభుత్వం మారుతుంది’ అని వ్యాఖ్యానించారు.

News March 2, 2026

పాకిస్థాన్‌పై విరాట్ అద్భుతం చేశారు: రోహిత్

image

2022 T20WCలో పాకిస్థాన్‌పై విరాట్ అద్భుత ఇన్నింగ్స్ ఆడారని రోహిత్ శర్మ గుర్తు చేసుకున్నారు. ‘160 పరుగుల టార్గెట్ ఛేదనలో 31కే 4 వికెట్లు పడిపోయాయి. నేను డ్రెస్సింగ్ రూమ్‌లో నిరాశగా ఉండిపోయా. అప్పుడు కోహ్లీ అద్భుతం చేశారు. అసలు మేం గెలిచే స్థితిలోనే లేము. అలాంటి ఇంపార్టెంట్ సిచ్యుయేషన్‌లో కోహ్లీ దాన్ని సుసాధ్యం చేశారు. నేను ఆడిన క్రికెట్ మ్యాచుల్లో అదొక గొప్ప ఆట’ అని ICC ఇంటర్వ్యూలో చెప్పారు.

News March 2, 2026

ఖమేనీ భార్య మృతి

image

ఇజ్రాయెల్-అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ <<19281898>>భార్య<<>> కూడా మరణించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఫిబ్రవరి 28న మిస్సైల్ దాడిలో గాయపడ్డ మన్సౌరే ఖోజాస్తే బగెర్జాదేహ్ కోమాలోకి వెళ్లారు. కాసేపటి క్రితం ఆమె మరణించినట్లు తెలుస్తోంది. 1947లో జన్మించిన మన్సౌరే 17 ఏళ్ల వయసులో అంటే 1964లో ఖమేనీని పెళ్లి చేసుకున్నారు. చాలా ఏళ్ల పాటు ఇరాన్ ఫస్ట్ లేడీగా ఉన్న ఆమె అత్యంత రహస్య జీవితాన్ని గడిపారు.