News January 24, 2026

ESIC ఢిల్లీలో ఉద్యోగాలు

image

<>ESIC <<>>ఢిల్లీ 45 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గల అభ్యర్థులు జనవరి 30న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి MBBS, MCh/DM, పీజీ డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. ఫుల్ టైమ్ స్పెషలిస్టుకు 69 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.500. SC, ST, PwBDలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://esic.gov.in/

Similar News

News April 4, 2026

ఇవాళ, రేపు జాగ్రత్త!

image

AP: రాష్ట్రంలో ఈరోజు, రేపు తీవ్రమైన వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, తూ.గో జిల్లాల్లో వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. ఇక ఏలూరు, పల్నాడు జిల్లాలపై వడగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. కాగా నిన్న 11 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. మన్యం(D)లోని భామినిలో అత్యధికంగా 41.8 డిగ్రీలు నమోదైంది.

News April 4, 2026

ALERT: ఇవాళ వర్షాలు

image

ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది.

News April 4, 2026

ఏప్రిల్ 6న ₹500కోట్ల ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన

image

TG: ఈనెల 6న నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ₹500కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. ₹300కోట్ల వ్యయంతో చేపట్టనున్న బాసర సరస్వతి ఆలయ అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. మరోవైపు ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్‌లో ₹200కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు శంకుస్థాపన చేస్తారు.