News September 28, 2024

హైందవేతరుల కోసం తిరుమలలో బోర్డుల ఏర్పాటు

image

AP: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే హైందవేతరులు పాటించాల్సిన నిబంధనల గురించి TTD బోర్డులు ఏర్పాటు చేసింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ATC సర్కిల్, గోకులం వద్ద బోర్డులు పెట్టింది. హైందవేతరులు ఆలయ ప్రవేశం చేయాలనుకుంటే శ్రీవారి పట్ల విశ్వాసం, గౌరవం ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్, అన్ని ఉప విచారణ కార్యాలయాల్లో పత్రాలు అందుబాటులో ఉంటాయంది.

Similar News

News November 21, 2025

NZB: KCR ఫ్యామిలీతో గోక్కున్నోడెవరూ బాగుపడలే: జీవన్ రెడ్డి

image

‘KCR ఫ్యామిలీతో గోక్కున్నోడెవరూ బాగుపడలే’ అని BRS నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ MLA ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉద్యమ కాలంలో వైఎస్సార్, చంద్రబాబు వంటి వారికే చుక్కలు చూపించామని అన్నారు. ఈ రేవంత్ రెడ్డి ఎంత, తెలంగాణ రాష్ట్ర చివరి కాంగ్రెస్ CMగా మిగిలిపోవడం ఖాయమన్నారు.

News November 21, 2025

పురుషుల జీవితంలో అష్టలక్ష్ములు వీళ్లే..

image

పురుషుని జీవితంలో సుఖసంతోషాలు, భోగభాగ్యాలు సిద్ధించాలంటే ఆ ఇంట్లో మహిళల కటాక్షం ఎంతో ముఖ్యం. తల్లి (ఆదిలక్ష్మి) నుంచి కూతురు (ధనలక్ష్మి) వరకు, ప్రతి స్త్రీ స్వరూపం అష్టలక్ష్మికి ప్రతిరూపం. వారిని ఎప్పుడూ కష్టపెట్టకుండా వారి అవసరాలను, మనసును గౌరవించి, సంతోషంగా ఉంచడమే నిజమైన ధర్మం. ఈ సత్యాన్ని గ్రహించి స్త్రీలను గౌరవిస్తే ఆ వ్యక్తి జీవితంలో మంచి జరగడం ఖాయమని పండితులు చెబుతున్నారు.

News November 21, 2025

బెల్‌లో అప్రెంటిస్ పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

BEL కోట్ద్వారాలో అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు ఇంజినీరింగ్ విద్యార్థులు, ఆప్షనల్ ట్రేడ్‌కు BBA, BBM, BBS అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ముందుగా NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. గ్రాడ్యుయేట్లకు నెలకు స్టైపెండ్ రూ.17,500, ఆప్షనల్ ట్రేడ్‌కు రూ.12,500 చెల్లిస్తారు.