News July 23, 2024
వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లు ఏర్పాటు: నిర్మల

మహిళల కోసం ప్రత్యేకంగా వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లు ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 2024-25 బడ్జెట్పై ఆమె ప్రసంగిస్తూ వర్క్ఫోర్స్లో మహిళల భాగస్వామ్యాన్ని హాస్టళ్లు, కేర్ సెంటర్ల ద్వారా ప్రోత్సహిస్తామన్నారు. మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించేందుకు రూ.3లక్షల కోట్లకు పైగా కేటాయించనున్నట్లు ఆమె వెల్లడించారు.
Similar News
News November 17, 2025
సత్వర న్యాయం అందించడమే లక్ష్యం: ఎస్పీ

ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకే పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. సోమవారం కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 58 అర్జీలు అందగా, వాటిలో 13 భూతగాదాలు, 18 కుటుంబ కలహాలు, 27 ఇతర విభాగాలకు చెందినవి ఉన్నాయి. ఈ అర్జీలను వెంటనే పరిష్కరించాలని ఆయా పోలీస్ స్టేషన్ల ఎస్.హెచ్.ఓ.లకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.
News November 17, 2025
బెల్లం.. మహిళలకు ఓ వరం

నిత్యం ఇంట్లో, బయట పనులను చేస్తూ మహిళలు తమ ఆరోగ్యాన్ని విస్మరిస్తారు. సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల వారికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలా కాకూడదంటే బెల్లాన్ని తమ డైట్లో చేర్చుకోవాల్సిందే. శరీరానికి కావాల్సిన కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు బెల్లంలో పుష్కలంగా ఉంటాయి. బరువును తగ్గించడంతో పాటు వ్యాధినిరోధక శక్తిని పెంచుతుందంటున్నారు నిపుణులు.
News November 17, 2025
శ్రీవారి సన్నిధిలో ఆంజనేయుడి ఆలయం

తిరుమల శ్రీవారి ఆలయం సన్నిధిలో ఎత్తైన ప్రదేశంలో ‘శ్రీ బేడీ ఆంజనేయస్వామి ఆలయం’ కనిపిస్తుంది. బాల్యంలో హనుమంతుడు తన వాహనమైన ఒంటె కోసం తిరుగుతుండేవాడు. ఆ అల్లరిని కట్టడి చేయడానికి, తల్లి అంజనాదేవి ఆయనకు బేడీలు తగిలించి, తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా కుదురుగా ఉండమని నిలబెట్టిందట. అందుకే ఈ ఆలయం బేడీ ఆంజనేయస్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ స్వామి కట్టుబాటుకు ప్రతీక. <<-se>>#VINAROBHAGYAMU<<>>


