News March 31, 2024

మొదలైన రిటైర్మెంట్లు

image

TG: రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఉద్యోగ విరమణలు ప్రారంభమయ్యాయి. 2021లో అప్పటి సర్కార్ ఉద్యోగుల విరమణ వయస్సును 58 నుంచి 61కి పెంచింది. దీంతో అప్పట్లో రిటైర్ అవ్వాల్సిన వారి ఉద్యోగ విరమణ మరో మూడేళ్లు పెరిగింది. ఆ గడువు మార్చి 31తో ముగుస్తోంది. ఇవాళ ఆదివారం కావడంతో సుమారు 336 మంది ఉద్యోగులు నిన్నే విరమణ పొందారు.

Similar News

News March 13, 2026

CSK ప్రమోషన్లలో రజినీ సాంగ్స్.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్!

image

జెర్సీ రివీల్ సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ‘కూలీ’ సాంగ్‌తో వీడియోను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇలా చేయడాన్ని ‘సన్ టీవీ’ యాజమాన్యం తప్పుబట్టింది. అనుమతి లేకుండా జైలర్, కూలీ, జైలర్-2 సినిమాల పాటలను ఉపయోగించకుండా నిరోధించాలని ‘SUN TV’ మద్రాస్ హైకోర్టులో దావా వేసింది. కాపీరైట్ ఉల్లంఘనపై విచారణ చేపట్టిన జస్టిస్ సెంథిల్‌కుమార్ రామమూర్తి నేడు కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

News March 13, 2026

వంటగ్యాస్.. దేశ ప్రజలకు కేంద్రం సూచన

image

దేశవ్యాప్తంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వంటగ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్రం తెలిపింది. ప్రజలు ఆందోళన పడి పానిక్ బుకింగ్ చేసుకోవద్దని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వాలు క్షేత్రస్థాయిలో పంపిణీని పర్యవేక్షించాలంది. టీవీలు పదేపదే పాత విజువల్స్‌ను చూపించవద్దని కోరింది. డేట్ వేసి విజువల్స్ ప్రసారం చేయాలని, దీనివల్ల ప్రజలకు కచ్చితమైన సమాచారం చేరుతుందని తెలిపింది.

News March 13, 2026

నెలసరి సెలవులతో మహిళలకే నష్టం కలగొచ్చు: సుప్రీంకోర్టు

image

నెలసరి సెలవులను తప్పనిసరి చేస్తే మహిళల కెరీర్‌పై ప్రభావం చూపొచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సంస్థలు మహిళల నియామకానికి ప్రాధాన్యం తగ్గించొచ్చని.. ఫలితంగా వర్క్‌ఫోర్స్‌లో వారి వాటా తగ్గొచ్చని తెలిపింది. ఇలాంటి పిటిషన్లు యువతుల్లో తాము కొన్నిసార్లు పురుషులతో సమానంగా పనిచేయలేమనే అభిప్రాయం కలిగిస్తాయని పేర్కొంది. కేంద్రం ఈ విషయాన్ని పరిశీలించాలని సూచిస్తూ సంబంధిత రిట్ పిటిషన్‌ను కొట్టివేసింది.