News January 22, 2026
EU దేశాలపై టారిఫ్స్ విధించట్లేదు: ట్రంప్

EU దేశాలపై విధించిన టారిఫ్స్ విషయంలో US అధ్యక్షుడు ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. ‘నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టేతో భేటీ అయ్యాను. గ్రీన్‌లాండ్ సహా ఆర్కిటిక్ ప్రాంతానికి సంబంధించి ఫ్యూచర్ డీల్ ఫ్రేమ్ వర్క్ రెడీ చేశాం. దీంతో ఒక్క USకే కాదు అన్ని NATO దేశాలకు మంచి జరుగుతుంది. యూరప్ దేశాలపై టారిఫ్స్ విధించట్లేదు. గ్రీన్‌ల్యాండ్‌కు సంబంధించిన గోల్డెన్ డోమ్‌పై మరిన్ని చర్చలు జరుగుతాయి’ అని తెలిపారు.
Similar News
News February 17, 2026
మొదలవని మ్యాచ్.. ఆస్ట్రేలియా పని అయిపోయినట్లేనా?

T20 WC2026: ఆస్ట్రేలియా జట్టు సూపర్-8 భవిష్యత్తును నిర్ణయించే మ్యాచుకు వర్షం అడ్డంకిగా మారింది. పల్లెకెలె స్టేడియంలో వర్షం పడుతుండటంతో జింబాబ్వే vs ఐర్లాండ్ మ్యాచ్ ఇంకా ప్రారంభం కాలేదు. వర్షం తగ్గే అవకాశాలు లేవని క్రిక్‌బజ్ తెలిపింది. ఈ మ్యాచ్ పూర్తిగా రద్దయితే ఆస్ట్రేలియా ఈ ప్రపంచకప్ నుంచి నిష్క్రమిస్తుంది. ఒకవేళ మ్యాచ్ జరిగి జింబాబ్వే గెలిచినా కంగారూలు ఇంటిదారి పట్టినట్లే.
News February 17, 2026
అంతిమ సంస్కారాల్లో మట్టి కుండను ఎందుకు పగులగొడతారు?

హిందూ ధర్మంలో మట్టి కుండను మానవ శరీరానికి, దానిలోని నీటిని ఆత్మకు ప్రతీకగా భావిస్తారు. ప్రదక్షిణ సమయంలో చిల్లుల నుంచి కారే నీరు, శరీరం-ఆత్మ మధ్య బంధం క్రమంగా వీడిపోవడాన్ని సూచిస్తుంది. చివరగా కుండను పగలగొట్టడం అంటే.. ప్రాపంచిక బంధాలన్నీ తెంచుకుని, పంచభూతాలతో నిర్మితమైన శరీరం తిరిగి ప్రకృతిలో కలిసిపోయిందని, ఆత్మ మోక్ష మార్గంలో స్వేచ్ఛగా పయనించాలని అర్థం. ఇది ఆత్మ అంతిమ విముక్తికి ప్రతీక.
News February 17, 2026
BEL 72 పోస్టులకు నోటిఫికేషన్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<


