News July 5, 2025

10,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని EU డిమాండ్

image

APSRTCలో ఖాళీగా ఉన్న 10,000 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఎంప్లాయిస్ యూనియన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. తమకు వెంటనే 11వ PRC బకాయిలు, పెండింగ్ DAలు చెల్లించాలని కోరింది. మరణించిన, రిటైర్డ్ ఉద్యోగులకు గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌లు తక్షణం చెల్లించాలని నిన్న విజయవాడలో నిర్వహించిన ధర్నాలో కోరింది. అటు కొత్తగా కొనుగోలు చేసే ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణను RTCకే అప్పగించాలని EU స్పష్టం చేసింది.

Similar News

News July 5, 2025

కాసేపట్లో వర్షం: వాతావరణ కేంద్రం

image

TG: రాబోయే 2-3 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, జగిత్యాల, భూపాలపల్లి, గద్వాల్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, మెదక్, మేడ్చల్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో వర్షం పడుతుందని అంచనా వేసింది. గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

News July 5, 2025

ప్రసిద్ధ్ కృష్ణపై ట్రోల్స్

image

ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో ఘోరంగా విఫలమైన భారత పేసర్ ప్రసిద్ధ్ కృష్ణపై SMలో భారీగా ట్రోల్స్ వస్తున్నాయి. షార్ట్ పిచ్ బంతులు వేసి జేమీ స్మిత్ సెంచరీకి కారణమయ్యాడని పలువురు విమర్శిస్తున్నారు. ‘ప్రసిద్ధ్ భారత్ వెర్షన్ హారిస్ రవూఫ్’ అని ఒకరు, ‘అతడిని వెంటనే ఇండియాకు పంపండి.. అవసరమైతే టికెట్ నేనే స్పాన్సర్ చేస్తా’ అని మరొకరు, ‘ప్రసిద్ధ్ ఇంగ్లండ్ తరఫున రన్ మెషిన్’ అని ఇంకొకరు కామెంట్లు పెడుతున్నారు.

News July 5, 2025

IIIT లిస్ట్.. ఒకే స్కూల్ నుంచి 26 మంది ఎంపిక

image

TG: నిన్న విడుదలైన బాసర IIIT <<16941421>>జాబితాలో<<>> నిజామాబాద్ జిల్లాలోని డొంకేశ్వర్ ZPHS విద్యార్థులు సత్తాచాటారు. ఏకంగా ఈ స్కూలు నుంచి 26 మంది ఎంపికయ్యారు. వీరిలో 19 మంది అమ్మాయిలు, ఏడుగురు అబ్బాయిలు ఉన్నారు. ఈ మండలం నుంచి 41 మంది స్టూడెంట్స్ సెలక్ట్ అవ్వడం గమనార్హం. ఎంపికైన విద్యార్థులకు స్కూల్ సిబ్బంది అభినందనలు తెలిపారు. కాగా తొలి విడతలో 1,690 మంది ఎంపికయ్యారు.