News September 22, 2024
గూగుల్‌పై చర్యలకు సిద్ధమవుతున్న EU

యూరోపియన్ యూనియన్ నుంచి గూగుల్‌కు మరో భారీ ఎదురుదెబ్బ తప్పేలా లేదు. సెర్చ్ ఇంజిన్‌లో అన్ని సంస్థలకు ప్రాధాన్యం ఇచ్చే విషయంలో గూగుల్ వేగంగా స్పందించకపోతే భారీ జరిమానాతోపాటు బిజినెస్ మోడల్ మార్పులపై ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉన్నట్టు EU అధికారులు చెబుతున్నారు. గూగుల్ ఫ్లైట్స్, హోటల్స్ వంటి సర్వీసుల్లో గూగుల్ సెర్చ్‌లో చూపించే ఫలితాల సరళికి వ్యతిరేకంగా ఈయూ ఛార్జిషీట్ సిద్ధం చేస్తోంది.
Similar News
News November 26, 2025
పల్నాడు: హెడ్ కానిస్టేబుల్ నిర్వాకం ఇలా..!

పెదకూరపాడు నియోజకవర్గంలోని హెడ్ కానిస్టేబుల్ చైన్ లింక్ ద్వారా తోటి పోలీసులు, సామాన్య ప్రజలతో డబ్బులు కట్టించారని బాధితులు ఆరోపిస్తున్నారు. తొలుత డాలర్లు కొనుగోలు చేస్తే తిరిగి వస్తాయి అంటూ కట్టించాడని, తమ వద్ద కమీషన్ పేరుతో డబ్బులు కూడా తీసుకున్నాడని చెబుతున్నారు. చివరకు అతను చెప్పిన విధంగా డబ్బులు రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించారు.
News November 26, 2025
AI చెప్పిన.. టాలీవుడ్ టాప్ హీరోలు వీరే

ఏఐ చాట్‌బోట్లయిన జెమిని, చాట్ Gpt, గ్రోక్‌లు టాలీవుడ్లో నంబర్ 1 హీరో డార్లింగ్ ప్రభాస్ అని ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయని సినీవర్గాలు తెలిపాయి. gemini: ప్రభాస్, అల్లు అర్జున్, NTR, రామ్ చరణ్, మహేశ్ బాబు. – Chatgpt: ప్రభాస్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, NTR, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ – Grok- ప్రభాస్, అల్లు అర్జున్, మహేశ్ బాబు, NTR, రామ్ చరణ్, పవన్. మరి మీ దృష్టిలో టాప్-6 టాలీవుడ్ హీరోలెవరు?COMMENT
News November 26, 2025
APPLY NOW: BECILలో ఉద్యోగాలు

బ్రాడ్కాస్ట్ ఇంజినీర్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) 18 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు DEC 7వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. డ్రైవర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, మెడికల్ ఫిజిసిస్ట్ పోస్టులు ఉన్నాయి. ఉద్యోగాన్ని బట్టి టెన్త్, ఇంటర్, PG, PG డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. డ్రైవర్ పోస్టుకు హెవీ వెహికల్ లైసెన్స్ తప్పనిసరి.


