News July 8, 2024

యూరో ఛాంపియన్ షిప్: సెమీస్ చేరిన జట్లివే..

image

యూరో ఛాంపియన్ షిప్ 2024లో సెమీస్ జట్లు ఖరారయ్యాయి. పోర్చుగల్‌తో పాటు ఆతిథ్య జర్మనీకి షాక్ ఇచ్చి స్పెయిన్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, ఇంగ్లండ్ జట్లు సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లాయి. భారత కాలమానం ప్రకారం రేపు అర్ధరాత్రి 12:30 గంటలకు స్పెయిన్, ఫ్రాన్స్ మధ్య తొలి సెమీస్ జరగనుండగా, ఎల్లుండి అర్ధరాత్రి నెదర్లాండ్స్, ఇంగ్లండ్ మధ్య రెండోది జరగనుంది. విజేతగా నిలిచిన జట్లు 15న ఫైనల్ ఆడనున్నాయి.

Similar News

News March 26, 2026

యుద్ధం.. భారత్‌పై ఇరాన్ ఒత్తిడి!

image

యుద్ధం వల్ల దౌత్యపరంగా భారత్‌పై ఒత్తిడి పెరుగుతున్నట్లు తెలుస్తోంది. US, ఇజ్రాయెల్ దాడులను BRICS కూటమి ఖండించేలా చర్యలు తీసుకోవాలని భారత్‌ను ఇరాన్‌ కోరినట్లు సమాచారం. అయితే కూటమిలో ఇరాన్ ప్రత్యర్థులైన సౌదీ – UAE ఉండటం, అమెరికా-ఇజ్రాయెల్ కూడా మిత్రపక్షాలే కావడం భారత్‌కు సవాల్‌గా మారింది. దీంతో ఈ ఏడాది BRICSకు అధ్యక్షత వహిస్తున్న భారత్ ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తికరంగా మారింది.

News March 26, 2026

మార్కాపురం ప్రమాదం.. మొండి కత్తితో 8 మందిని కాపాడాడు

image

AP: మార్కాపురం <<19479058>>బస్సు ప్రమాద ఘటన<<>>లో ఓ వ్యక్తి ఎనిమిది మంది ప్రాణాలను కాపాడారు. బస్సులో మంటలు చెలరేగగానే అక్కడే ఉన్న మొండికత్తితో అద్దాలు పగలగొట్టి ఎనిమిది మందిని బయటకు తోసేశారు. తర్వాత తాను కూడా బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. పొగ దట్టంగా వ్యాపించడంతో మిగతా వాళ్లను కాపాడలేకపోయానని ఆయన తెలిపారు. కాగా ఈ ఘటనలో 13 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే.

News March 26, 2026

బ్రెయిన్‌లో ఆలోచనలు.. నిద్ర పట్టక పాట్లు!

image

ప్రస్తుతం చాలామంది ‘నిద్రలేమి’ సమస్యతో బాధపడుతున్నారు. రోజంతా బిజీగా ఉండటంతో రాత్రి మైండ్ రెస్ట్‌లోకి వెళ్లకపోవడంతో నిద్ర పట్టదు. దీన్నే ‘కాగ్నిటివ్ హైపర్- అలర్ట్‌నెస్’ అంటారు. కొన్ని జీవనశైలి మార్పులతో దీనిని అధిగమించవచ్చు. *నిద్రకు ముందు TV చూడొద్దు. *రోజూ ఒకే సమయానికి పడుకోండి. *గదిలో వెలుతురు ఉండొద్దు. *రాత్రి కాఫీ, టీ తాగకండి. *వ్యాయామం, వాకింగ్, మెడిటేషన్ చేస్తే హాయిగా నిద్రపడుతుంది.