News June 17, 2024

తిరుమలలో ఈవో తనిఖీలు

image

AP: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నూతన ఈవో J శ్యామలారావు తిరుమలలోని పలు విభాగాలను పరిశీలించారు. ఆలయం, రిసెప్షన్, అన్నప్రసాదం, ఇంజినీరింగ్ విభాగాలను తనిఖీ చేసి సమీక్షించారు. సమాజంతో తిరుమలకు భావోద్వేగ సంబంధం ఉందని ఈవో పేర్కొన్నారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు నాణ్యమైన ఆహారం, పరిశుభ్రత, సరైన సౌకర్యాలు అందించడం మన ప్రాథమిక కర్తవ్యాలు అని సిబ్బందికి మార్గనిర్దేశం చేశారు.

Similar News

News January 3, 2026

IIIT డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూలులో ఉద్యోగాలు

image

<>IIIT <<>>డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూలు 10 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి జనవరి 24వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీహెచ్‌డీతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, డెమాన్‌స్ట్రేషన్, రీసెర్చ్ ప్రజెంటేషన్(PPT), ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://iiitk.ac.in

News January 3, 2026

కేసీఆర్, జగన్ ఏపీకి మేలు చేయాలని చూశారు: ఉత్తమ్

image

TG: గతంలో కేసీఆర్, జగన్ చర్చించుకొని ఏపీకి మేలు చేయాలని చూశారని మంత్రి ఉత్తమ్ కుమార్ అసెంబ్లీలో PPT సందర్భంగా ఆరోపించారు. ‘గోదావరి జలాలను రాయలసీమకు తీసుకెళ్తామని కేసీఆర్ అన్నారు. బేసిన్లు లేవు, భేషజాలు లేవు అని చెప్పింది ఆయనే. ఏపీ-తెలంగాణ వేర్వేరు కాదన్నారు. 2015లో కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల వాటాకు అంగీకరించిందే కేసీఆర్ అని’ పునరుద్ఘాటించారు.

News January 3, 2026

ఉల్లి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ

image

AP: ప్రకృతి వైపరీత్యాలు, ధరల పతనంతో నష్టపోయిన ఉల్లి రైతులకు ప్రభుత్వం చేయూతనందించింది. ఖరీఫ్‌లో పంట నష్టపోయిన రైతుల ఖాతాల్లో హెక్టార్‌కు రూ.20 వేల చొప్పున నగదును మంత్రి అచ్చెన్నాయుడు జమ చేశారు. కర్నూలు, కడప జిల్లాలకు చెందిన 37,752 మంది రైతుల అకౌంట్లలో రూ.128.33 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. కర్నూల్ జిల్లాల్లోనే 31,352 మంది ఖాతాల్లో రూ.99.92కోట్లు జమైనట్లు ప్రభుత్వం పేర్కొంది.