News May 21, 2024
ఈవీ నూతన విధాన మార్గదర్శకాల జారీకి సిద్ధమైన కేంద్రం
విద్యుత్ వాహనాల తయారీపై రాయితీలు, ప్రోత్సాహకాలపై స్పష్టతకు ఆయా పరిశ్రమ వర్గాలతో త్వరలో కేంద్రం మరోసారి సమావేశం కానుంది. EV ప్రాజెక్టుపై సుమారు రూ.4,150కోట్లు పెట్టుబడి పెడితే పన్నుల తగ్గింపు, పలు రాయితీలు ఇచ్చేలా కేంద్రం మార్గదర్శకాలు రూపొందించినట్లు తెలుస్తోంది. కాగా ఆయా సంస్థలు మూడేళ్లలో తమ ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించాల్సి ఉంటుంది. అయిదేళ్లలో 50% విడిభాగాలను మన దేశంలో ఉత్పత్తి చేయాలి.
Similar News
News December 26, 2024
జైల్లో అల్లర్లు: 1500మంది పరారీ.. 33మంది మృతి
మొజాంబిక్ రాజధాని మపూటోలోని ఓ జైల్లో తాజాగా చెలరేగిన అల్లర్లలో 1534మంది క్రిమినల్స్ జైలు నుంచి పరారు కాగా 33మంది మృతిచెందారు. 15మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎన్నికల్లో అధికార పార్టీదే విజయమని ఆ దేశ సుప్రీం కోర్టు ప్రకటించడంతో ప్రతిపక్షాలు మొదలుపెట్టిన అల్లర్లు జైలు వరకూ విస్తరించాయి. 150మందిని తిరిగి పట్టుకున్నామని, మిగిలిన ఖైదీల కోసం గాలింపు చేపట్టామని అధికారులు తెలిపారు.
News December 26, 2024
సీఎం తన తమ్ముడిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు: హరీశ్
TG: సంధ్య థియేటర్ ఘటనను ప్రభుత్వం రాజకీయం చేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. సినిమా వాళ్లను భయపెట్టి CM మంచి చేసుకోకూడదని హితవు పలికారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ఆయన పరామర్శించారు. రాష్ట్రంలో ఓ సర్పంచి ఆత్మహత్యకు కారణమైన CM తమ్ముడిని ఎందుకు అరెస్ట్ చేయడంలేదని ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానమన్న ముఖ్యమంత్రి, తన తమ్ముడిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ధ్వజమెత్తారు.
News December 26, 2024
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని పేర్కొంది. అటు తెలంగాణలోనూ పలు జిల్లాల్లో రేపు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.