News January 18, 2025
ఓర్వకల్లులో ఈవీ పార్కు.. 25వేల ఉద్యోగాలు!

AP: రాష్ట్రంలో పీపుల్ టెక్ సంస్థ ఎలక్ట్రిక్ వాహన పార్కు ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని మొబిలిటీ వ్యాలీలో రూ.1,800 కోట్ల వ్యయంతో 1200 ఎకరాల్లో ఈ వాహన పార్కును నిర్మించనుంది. ఇది పూర్తయితే దాదాపు 25 వేల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
Similar News
News December 8, 2025
EC షెడ్లో కోడి పిల్లలను వదిలేముందు పేపర్ వేస్తున్నారా?

EC(ఎన్విరాన్మెంట్ కంట్రోల్డ్) షెడ్లో పొట్టు మీద కోడి పిల్లలను నేరుగా వదలడం మంచిది కాదు. షెడ్లో పొట్టు కాస్త పదునుగా ఉండటం వల్ల కోడి పిల్లల కాళ్ల మధ్య గుచ్చుకొని గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ పొట్టుపై కచ్చితంగా పేపర్ వేశాకే చిన్న కోడి పిల్లలను వదలాలి. 1000 పిల్లలకు 5 కేజీల పేపరును పైన వీడియోలో చెప్పిన విధంగా వేయాలి. పేపరు వల్ల కోడి పిల్లలు ఆహారాన్ని సులభంగా గుర్తించి తినగలుగుతాయి.
News December 8, 2025
సకల సంపద ‘విష్ణుమూర్తే’

వసుర్వసుమనాః సత్యః సమాత్మా సమ్మితస్సమః|
అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః||
ఈ సృష్టిలోని సమస్త సంపద ఆ విష్ణుమూర్తే. ఆయన మన మంచి కోరుతాడు. ఎప్పుడూ సత్యంగా, అందరిపట్ల సమానంగా ఉంటాడు. ఆ అమోఘుడు పద్మం వంటి కళ్లతో వర్షాన్ని కురిపిస్తాడు. కురిసే వర్షం కూడా ఆయనే. ఈ ప్రపంచంలో ఉన్న సంపద, సత్యం, సమానత్వం.. అన్నీ భగవంతుడి స్వరూపాలే. అందుకే, మనమంతా ఆయనను ప్రేమతో, భక్తితో ధ్యానించాలి. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>
News December 8, 2025
‘స్మృతి ఈజ్ బ్యాక్’.. ప్రాక్టీస్ షురూ

పలాశ్ ముచ్చల్తో పెళ్లి రద్దు తర్వాత భారత క్రికెటర్ స్మృతి తొలిసారి మీడియాకు కనిపించారు. ఈ నెల 21 నుంచి శ్రీలంకతో జరిగే T20 సిరీస్ కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టారు. నెట్స్లో బ్యాటింగ్ చేస్తున్న ఫొటో బయటకు వచ్చింది. కాగా పెళ్లి రద్దుపై తమ ప్రైవసీని గౌరవించాలని ఆమె విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రాక్టీస్ను ఉద్దేశించి ‘స్మృతి ఈజ్ బ్యాక్’ అంటూ ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు.


