News March 16, 2024
పదేళ్లయినా రాజధాని ఎక్కడో చెప్పలేకపోతున్నారు:రేవంత్
AP: రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగువాళ్లుగా ఒకరికొకరు అండగా ఉండాల్సిన అవసరం ఉందని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. విశాఖలో నిర్వహించిన కాంగ్రెస్ న్యాయ సాధన సభలో మాట్లాడుతూ.. ‘ఢిల్లీ పాలకులు విశాఖ ఉక్కును కదిలించలేరు. ఇక్కడి పాలకులు మోదీకి లొంగిపోయారు. రాష్ట్ర ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టారు. పదేళ్లయినా రాజధాని ఎక్కడుందో చెప్పలేకపోతున్నారు. పోలవరం పూర్తి చేయలేకపోయారు’ అని విమర్శించారు.
Similar News
News November 21, 2024
అవును.. మా అమ్మాయికి పెళ్లి: కీర్తి సురేశ్ తండ్రి
నటి కీర్తి సురేశ్ త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. చిన్ననాటి స్నేహితుడు ఆంథోనీ తట్టిల్తో వచ్చే నెలలో గోవాలో ఆమె వివాహం చేయనున్నట్లు కీర్తి తండ్రి సురేశ్ కుమార్ ఆన్మనోరమ వార్తాసంస్థకు తెలిపారు. తట్టిల్కి కేరళ, చెన్నైలో వ్యాపారాలున్నాయి. కుటుంబీకులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరుగుతుందని ఆయన వెల్లడించారు.
News November 21, 2024
కీర్తి సురేశ్ కాబోయే భర్త ఆస్తులెంతో తెలుసా?
హీరోయిన్ కీర్తి సురేశ్, ఆంథోనీ తట్టిల్ ఒకే స్కూళ్లో చదువుకున్నారు. 12వ తరగతి నుంచి వీరి స్నేహం ప్రేమగా మారిందని కీర్తి తండ్రి తెలిపారు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆంథోనీ కొన్నాళ్లు గల్ఫ్ దేశం ఖతర్లో పని చేశారు. ఆ తర్వాత కొచ్చి (కేరళ)కి వచ్చి ఓ కంపెనీ స్థాపించారు. Asperos అనే మరో సంస్థ, హోటల్ వ్యాపారాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆంథోనీకి సుమారు రూ.300 కోట్ల ఆస్తులు ఉన్నాయని సమాచారం.
News November 21, 2024
2 జిల్లాల్లో 100% పూర్తయిన ఇంటింటి సర్వే
TG: సమగ్ర ఇంటింటి సర్వే జనగాం, ములుగు జిల్లాల్లో వందశాతం పూర్తయిందని ప్రభుత్వం తెలిపింది. నల్గొండ, కామారెడ్డి, మంచిర్యాల, భువనగిరి, జగిత్యాల, NZB, సిరిసిల్ల, గద్వాల, MBNR, మెదక్, మహబూబాబాద్, పెద్దపల్లి, ఆసిఫాబాద్, నారాయణపేట, భూపాలపల్లి, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో 90 శాతానికి పైగా సర్వే పూర్తయింది. GHMCలో 60.60% లక్ష్యాన్ని అందుకున్నట్లు సర్కార్ వివరించింది.