News February 22, 2025

60 కోట్ల మంది స్నానమాచరించినా శుద్ధిగానే గంగానది: సైంటిస్ట్

image

‘మహాకుంభమేళా’లో దాదాపు 60 కోట్ల మంది స్నానమాచరించినా గంగానదిలోని నీళ్లు పరిశుభ్రంగా ఉన్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. పద్మశ్రీ అవార్డు గ్రహీత, శాస్త్రవేత్త డా. అజయ్ సోంకర్ గంగా జలంపై అధ్యయనం చేశారు. ‘గంగా నదిలో 1100 రకాల బాక్టీరియోఫేజ్‌లు సహజంగా నీటిని శుద్ధి చేస్తాయి. కాలుష్యాన్ని తొలగించడంతో పాటు చెడు బాక్టీరియా, సూక్ష్మక్రిములను నాశనం చేసి శుద్ధి చేస్తాయి’ అని సోంకర్ తెలిపారు.

Similar News

News January 24, 2026

ఇండియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలు

image

ఇండియన్ బ్యాంక్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ 6 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి డిగ్రీ(BA, B.Com, BSc, BSW), MA, MSW, టెన్త్ అర్హతతో పాటు పని అనుభవం గలవారు JAN 26 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 22 -40ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, డెమాన్‌స్ట్రేషన్/ప్రజెంటేషన్(ఫ్యాకల్టీ), ఇంటర్వ్యూ, DV ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://indianbank.bank.in

News January 24, 2026

మనాలిపై మంచు దుప్పటి..

image

హిమాచల్‌ప్రదేశ్ మనాలిలో మంచు దట్టంగా కురుస్తోంది. మంచు తీవ్రతకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చలి తీవ్రతకు ప్రజలు, పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. భారీగా మంచు కురుస్తుండడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రానున్న 3రోజులు ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. SAT రాత్రి టెంపరేచర్లు ‘-3’ డిగ్రీలుగా నమోదుకావొచ్చని, 10-15KMల వేగంతో గాలులు వీస్తాయని చెబుతున్నారు.

News January 24, 2026

‘సర్, ప్లీజ్ చేయి తీయండి’.. మౌనీ రాయ్‌కు చేదు అనుభవం

image

బాలీవుడ్ నటి మౌనీ రాయ్‌కు చేదు అనుభవం ఎదురైంది. హరియాణాలోని కర్నాల్‌లో జరిగిన ఓ వేడుకలో స్టేజ్‌ వైపు వెళ్తున్న సమయంలో ఫొటోలు తీసుకునే నెపంతో కొందరు ప్రేక్షకులు నడుముపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించారని ఆమె వెల్లడించారు. “సర్, ప్లీజ్ చేయి తీయండి” అని అడిగితే వారు మరింత దురుసుగా స్పందించారని తెలిపారు. స్టేజ్‌పైకి వెళ్లిన తర్వాత కూడా అసభ్య సైగలతో వేధించారని పేర్కొన్నారు.