News June 22, 2024
66 ఏళ్లొచ్చినా అయ్యన్న ఫైర్ బ్రాండే: సీఎం చంద్రబాబు

AP: స్పీకర్‌గా ఎన్నికైన అయ్యన్నపాత్రుడికి CM చంద్రబాబు అసెంబ్లీలో శుభాకాంక్షలు తెలిపారు. ‘ఓ BC నేత సభాధ్యక్ష స్థానంలో కూర్చోవడం ఆనందంగా ఉంది. NTR పిలుపుతో అయ్యన్న రాజకీయాల్లోకి వచ్చారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కృషి చేశారు. ఏ పదవి చేపట్టినా వన్నె తెచ్చారు. 66 ఏళ్లొచ్చినా పాలిటిక్స్‌లో ఆయన ఫైర్ బ్రాండే. గత ఐదేళ్లలో రాజకీయంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా ధైర్యంగా నిలబడి ఎదుర్కొన్నారు’ అని కొనియాడారు.
Similar News
News November 18, 2025
పెదాలు పగులుతున్నాయా?

శీతాకాలంలో పెదాలు తరచూ పొడిబారి పగిలిపోతుంటాయి. ఇలా కాకుండా ఉండాలంటే వెన్న, నిమ్మరసం, దోస, టమాటా గుజ్జు పూయాలి. లిప్‌బామ్ రాయడం మర్చిపోకూడదు. రాత్రి పడుకునే ముందు నేతితో పెదాలను మర్దనా చేయడం వల్ల కూడా పెదాలు మృదువుగా ఉంటాయి. డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. నాణ్యమైన ఉత్పత్తులనే వాడాలి. అలాగే మంచి పోషకాహారం, తగినంత నిద్ర మిగతా శరీర భాగాల్లాగే పెదాలకూ అవసరం. కాబట్టి జీవనశైలి బావుండేలా చూసుకోవాలి.

కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ఉద్యోగాలు

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ 27 కాంట్రాక్ట్ ఆపరేటర్ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 21వరకు అప్లై చేసుకోవచ్చు. ఏడో తరగతి ఉత్తీర్ణతతో పాటు హెవీ వెహికల్ లైసెన్స్, ఉద్యోగ అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ప్రాక్టికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.200, SC,STలకు ఫీజు లేదు.