News April 16, 2025

చనిపోయినా చిరస్థాయిగా చరిత్రలో ఆమె పేరు!

image

TG: ఖమ్మం జిల్లా గంగారంతండాకి చెందిన దివంగత యువ శాస్త్రవేత్త అశ్వినికి అరుదైన గౌరవం దక్కింది. ప్రొ. జయశంకర్ వ్యవసాయ వర్సిటీ పూర్వ విద్యార్థిని అయిన ఆమె వ్యవసాయ రంగంలో ఎంతో కృషి చేశారు. గత ఏడాది వరదల్లో ఆమె కన్నుమూశారు. కానీ ఆమె ప్రతిభకు కేంద్రం తాజాగా గుర్తింపు అందించింది. అశ్విని పేరిట జాతీయ స్థాయిలో కొత్త శనగ వంగడాన్ని విడుదల చేసింది. త్వరలో గెజిట్ నోటిఫికేషన్‌లో ఆ వంగడాన్ని పొందుపరచనున్నారు.

Similar News

News April 16, 2025

GREAT: ఆ రెండు ఘనతలూ పంజాబ్‌వే..

image

IPL-2025: KKRతో జరిగిన లోస్కోరింగ్ మ్యాచ్‌లో <<16112256>>PBKS<<>> అనూహ్య విజయం సాధించిన విషయం తెలిసిందే. 112 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతాను 95 పరుగులకే కట్టడి చేసింది. IPLలో ఇంత తక్కువ స్కోరు(111)ను కాపాడుకోవడం ఇదే తొలిసారి. కాగా, ఇదే పంజాబ్ 2024 సీజన్లో KKRపై 262 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే ఛేదించింది. ఆ మ్యాచ్‌లో బెయిర్‌స్టో సెంచరీతో చెలరేగారు. ఆ గేమ్ మీకు గుర్తుంటే COMMENT చేయండి.

News April 16, 2025

పోలీసుల పనితీరులో దేశంలోనే తెలంగాణ టాప్

image

పోలీసు విభాగం పనితీరుకు సంబంధించి ఇండియా జస్టిస్ రిపోర్ట్-2025 ప్రకారం తెలంగాణ 6.48 పాయింట్లతో దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది. ఈ కేటగిరిలో 6.44Pతో ఏపీ రెండో స్థానం, 6.19Pతో కర్ణాటక మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. ఇదే విభాగంలో ప.బెంగాల్ చిట్టచివర నిలిచింది. జ్యుడీషియల్ ర్యాంకింగ్‌లో TGకి 2వ, APకి 5వ స్థానాలు దక్కాయి. అలాగే, ప్రిజన్స్ విభాగంలో ఏపీ 4వ, టీజీ 7వ స్థానంలో నిలిచాయి.

News April 16, 2025

నితీశ్ కుమార్ మళ్లీ సీఎం అవుతారు: నిషాంత్

image

బిహార్‌లో ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ కుమార్ తిరిగి CM అవుతారని ఆయన కుమారుడు, JDU నేత నిషాంత్ ధీమా వ్యక్తం చేశారు. 2010 కంటే ఈసారి ఎక్కువ చోట్ల తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. అలాగే, బిహార్ Dy.CM సామ్రాట్ చౌదరి మాట్లాడుతూ.. INDI కూటమి ఎంత పోరాడినా ఫలితం ఉండదన్నారు. అటు నితీశ్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కాంగ్రెస్-RJD వ్యూహాలు రచిస్తోంది.

error: Content is protected !!