News February 26, 2025
తేళ్లు, బొద్దింకలు కూడా తిన్నా: కామాక్షి భాస్కర్ల

తాను చైనాలో ఎంబీబీఎస్ చదువుకునే సమయంలో తేళ్లు, బొద్దింకలు కూడా తిన్నానని హీరోయిన్ కామాక్షి భాస్కర్ల తెలిపారు. తాను ఎక్కడికి వెళ్లినా అక్కడి వంటకాలు ట్రై చేస్తానని చెప్పారు. ‘చైనాలో ఒకప్పుడు గ్రీనరీ ఉండేది కాదు. తినడానికి కూరగాయలు కూడా దొరికేవి కాదు. అందుకే కనిపించిన జీవుల్ని చంపి తినడం వారికి అలవాటైంది’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ‘మా ఊరి పొలిమేర’ సిరీస్ చిత్రాలతో కామాక్షి ఫేమస్ అయిన విషయం తెలిసిందే.
Similar News
News December 25, 2025
శివాజీ వ్యాఖ్యల వివాదం.. అనసూయ వార్నింగ్

TG: శివాజీ వివాదాస్పద <<18666465>>వ్యాఖ్యల<<>> నేపథ్యంలో నటి అనసూయ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. రాజ్యాంగంలో ఆర్టికల్-19 కింద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని అడ్వకేట్ లీలా శ్రీనివాస్ మాట్లాడిన <
News December 25, 2025
తిరుమలలో RSS చీఫ్..

తిరుపతిలోని సప్త గో ప్రదక్షిణశాలను RSS చీఫ్ మోహన్ భాగవత్ ఇవాళ సందర్శించారు. హిందూ సంప్రదాయంలో గోపూజకు ఉన్న ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుతో కలిసి తిరుమల తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో భోజనం చేశారు. తిరుపతిలోని నేషనల్ సంస్కృత విశ్వవిద్యాలయంలో శుక్రవారం నుంచి 4 రోజులపాటు జరగనున్న భారతీయ విజ్ఞాన సమ్మేళనానికి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యేందుకు ఆయన తిరుపతి చేరుకున్నారు.
News December 25, 2025
భవిష్యత్‌లో సిరులు కురిపించనున్న కాపర్!

రానున్న రోజుల్లో కాపర్ (రాగి) ధరలు మరింతగా పెరుగుతాయని వ్యాపార విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిన్న టన్ను కాపర్ ధర $12వేలు దాటింది. ఎలక్ట్రిక్ వాహనాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్లు, పవర్ గ్రిడ్ నిర్మాణాలకు ఇవి ఎంతో కీలకం కాబట్టి ధరలు పెరుగుతున్నాయని తెలిపారు. 2030 నాటికి కాపర్ డిమాండ్ 60% పెరుగుతుందని అంచనా వేశారు. బంగారం, వెండిలాగే కాపర్‌పైనా పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నారు.


