News August 4, 2024
చదువు కోసమైనా సరే.. కొట్టడం క్రూరత్వమే: హైకోర్టు

చదువు, క్రమశిక్షణ కోసమైనా సరే పిల్లల్ని కొట్టడం క్రూరత్వమని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు పేర్కొంది. అక్కడి సర్‌గుజా జిల్లాలో టీచర్ కొట్టడంతో ఓ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. దీంతో టీచర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. క్రమశిక్షణ కోసం దండించానని తనపై కేసు కొట్టేయాలని ఆమె కోరగా కోర్టు నిరాకరించింది. ‘పిల్లలు జాతికి సంపద. వారికి ప్రేమతో నేర్పించాలి కానీ క్రూరత్వంతో కాదు’ అని తేల్చిచెప్పింది.
Similar News
News April 2, 2026
రాష్ట్రానికి YCP పీడ విరగడవ్వాలి: CBN

AP: అమరావతిపై YCPకి ఇప్పటికీ జ్ఞానోదయం కలగలేదని CM CBN విమర్శించారు. ‘అసెంబ్లీలో తీర్మానం పెడితే రాలేదు. కనీస జ్ఞానముండే వ్యక్తి అయితే రావాలి. పార్లమెంటులో అమరావతిని వ్యతిరేకించిన ఏకైక పార్టీ YCP. ఆ పార్టీ పేరు పలకాలా? ప్రజలంతా ఇక దాన్ని మరిచిపోవాలి. ఈ రాష్ట్రానికి వైసీపీ పీడ విరగడవ్వాలి’ అని అన్నారు. మావిగన్ ఏంటో అర్థం కాలేదని, డిక్షనరీలోనూ లేదని ఎద్దేవా చేశారు.
News April 2, 2026
హార్ముజ్ సంక్షోభంపై కీలక భేటీ.. భారత్ అటెండ్!

హార్ముజ్ మీదుగా నౌకల రాకపోకలపై UK ఏర్పాటు చేయనున్న కీలక సమావేశంలో భారత్ పాల్గొంటుందని కేంద్రం తెలిపింది. ఈరోజే జరగనున్న ఈ వర్చువల్ భేటీకి విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ హాజరవుతారని వెల్లడించింది. గ్యాస్, ఇంధనంతో వస్తున్న భారత నౌకల భద్రత కోసం ఇరాన్ సహా ఇతర దేశాలతో టచ్‌లో ఉన్నామని, ఇప్పటికే 6 నౌకలు సేఫ్‌గా దాటాయని తెలిపింది. హార్ముజ్ సంక్షోభాన్ని పరిష్కరించడమే లక్ష్యంగా ఈ భేటీ జరగనుంది.
News April 2, 2026
దేశమంతా అమరావతి వెంట నిలబడింది: CBN

AP: అమరావతి అత్యంత పవిత్ర స్థలమని CM CBN అభివర్ణించారు. ‘దేశంలోని అన్ని ఆలయాలు, ప్రార్థనా స్థలాల నుంచి మట్టిని, నదుల నుంచి జలాన్ని తెచ్చి పునీతం చేశాం. అలాంటి ఈ ప్రాంతాన్ని గత పాలకులు మూడుముక్కలాటతో విధ్వంసం చేశారు. కానీ ఇవాళ పార్లమెంటులో YCP తప్ప దేశంలోని అన్ని పార్టీలు అమరావతి వెంట నిలిచాయి’ అని ఉద్దండరాయునిపాలెంలో నిర్వహించిన సభలో పేర్కొన్నారు. అమరావతిని వరల్డ్ బెస్ట్ సిటీగా మారుస్తామన్నారు.


