News July 23, 2024

బీజేపీకి 8 ఎంపీ సీట్లిచ్చినా TGకి నిరాశే!

image

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మరోసారి నిరాశ ఎదురైంది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణ ప్రజలు భారీగా ఓట్లేశారు. ఈసారి నార్త్ ఇండియాలో బీజేపీకి సీట్లు తగ్గినా తెలంగాణలో అధికార కాంగ్రెస్‌తో సమానంగా ఆ పార్టీకి 8 సీట్లు కట్టబెట్టారు. దీంతో ఈసారి బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు వస్తాయని అంతా అంచనా వేశారు. కానీ కేంద్రం ఆ ఊసే ఎత్తలేదు.

Similar News

News December 8, 2025

ముడతలు తగ్గించే ఫేస్ ప్యాక్

image

యవ్వనంగా కనిపించే చర్మం కోసం రసాయన ఉత్పత్తులకు బదులు ఇంట్లోని సహజ పదార్థాలను వాడితే చాలు. వాటిల్లో ఒకటే ఈ అరటిపండు ఫేస్ ప్యాక్. బాగా మగ్గిన అరటిపండును తీసుకొని కాస్త తేనె, బార్లీ పౌడర్ కలిపి పేస్ట్ చేయాలి. బార్లీకి బదులు బియ్యప్పిండి కూడా వాడొచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖానికి అరగంట ఉంచిన తర్వాత కడిగేయాలి. వారానికోసారి ఈ ప్యాక్ వేస్తే చర్మం యవ్వనంగా మారుతుంది.

News December 8, 2025

శివలింగానికి అభిషేకం చేస్తున్నారా?

image

శివుడు అభిషేక ప్రియుడు. అయనను నీటితో అభిషేకించినా అనుగ్రహిస్తాడని భక్తులు నమ్ముతారు. అయితే ఉత్తర/తూర్పు దిశలో నిలబడి రాగి/కంచు పాత్రతో శివాభిషేకం చేయడం అత్యంత శ్రేష్ఠమని పండితులు చెబుతున్నారు. అభిషేక సమయంలో ‘‘ఓం నమః శివాయ’’ అనే పంచాక్షరీ మంత్రం లేదా ‘‘ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహీ తన్నో రుద్ర ప్రచోదయాత్’’ అనే గాయత్రీ మంత్రాన్ని పఠించాలని సూచిస్తున్నారు. మరింత సమాచారం కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.

News December 8, 2025

సకీనా ఠాకూర్ సక్సెస్ వెనుక కారణాలు ఇవే

image

అమ్మాయివి.. పీజీ చేశావ్, పాల వ్యాపారం చేస్తావా? అని చాలా మంది సకీనాను ఎగతాళి చేశారు. అవేవీ పట్టించుకోకుండా తన మీద నమ్మకంతోనే ఆమె ముందడుగు వేశారు. పాడి సమాచారాన్ని Youtube, ఇతర రైతుల నుంచి తెలుసుకునేవారు. మిల్కింగ్ మెషీన్, గ్రాస్ కట్టర్ వంటి పరికరాలను ఉపయోగించి కూలీల ఖర్చు తగ్గించుకున్నారు. స్థానిక మేతతో పాటు పంజాబ్ నుంచి దాణా తెప్పించి పశువులకు అందించారు. దీంతో పాల ఉత్పత్తి, ఆదాయం పెరిగింది.