News November 7, 2024

రాజీ కుదిరినా లైంగిక వేధింపుల కేసును కొట్టేయలేం: సుప్రీంకోర్టు

image

బాధితులు, నిందితుడు రాజీ కుదుర్చుకున్నప్పటికీ లైంగిక వేధింపుల కేసును రద్దు చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిందితుడికి అనుకూలంగా రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. అతనిపై విచారణను కొనసాగించాలని ఆదేశించింది. 2022లో ఓ టీచర్‌పై మైనర్ బాలిక లైంగిక వేధింపుల కేసు పెట్టింది. ఆ తర్వాత వారిమధ్య రాజీ కుదరడంతో FIRను హైకోర్టు రద్దు చేసింది. ఈ తీర్పును ఓ వ్యక్తి సుప్రీంలో సవాల్ చేశారు.

Similar News

News January 22, 2026

గురువును మించిన శిష్యుడు.. యువీ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్

image

T20 క్రికెట్‌లో టీమ్ ఇండియా యువ సంచలనం అభిషేక్ శర్మ సిక్సర్లతో విరుచుకుపడుతున్నారు. తాజాగా NZతో జరిగిన మ్యాచ్‌లో తన గురువు యువరాజ్ సింగ్ (74 సిక్సర్లు) రికార్డును 33 ఇన్నింగ్స్‌ల్లోనే అధిగమించారు. ప్రస్తుతం T20Iల్లో 81 సిక్సర్లతో భారత ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానానికి చేరుకున్నారు. యువీ శిక్షణలో రాటుదేలిన అభిషేక్.. గురువును మించిన శిష్యుడిగా మైదానంలో పరుగుల వర్షం కురిపిస్తున్నారు.

News January 22, 2026

ప్రభాస్ ‘రాజాసాబ్’కు దారుణమైన కలెక్షన్లు

image

ప్రభాస్, మారుతి కాంబినేషన్లో తెరకెక్కిన ‘రాజాసాబ్’ వసూళ్లు దారుణంగా పడిపోయాయి. నిన్న దేశవ్యాప్తంగా థియేటర్లలో రూ.0.48 కోట్లు(15%- థియేటర్ ఆక్యుపెన్సీ) వసూలు చేసిందని sacnilk తెలిపింది. తొలి వారం రూ.130 కోట్ల(నెట్) కలెక్ట్ చేయగా 13 రోజుల్లో మొత్తంగా రూ.141.98 కోట్లు రాబట్టినట్లు వెల్లడించింది. కాగా ఇప్పటివరకు ఈ మూవీ 55శాతమే రికవరీ చేసిందని సినీ వర్గాలు తెలిపాయి.

News January 22, 2026

NALCOలో 110 పోస్టులు.. అప్లై చేశారా?

image

నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (<>NALCO<<>>)లో 110 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. BTech/BE(మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్) ఉత్తీర్ణులు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. GATE-2025 స్కోరు ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500. వెబ్‌సైట్: https://mudira.nalcoindia.co.in