News May 1, 2024

ఈవీ సేల్స్ తగ్గినా ఓలా తగ్గేదేలే!

image

ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాల్లో ఓలా దూసుకెళ్తోంది. 33,934 యూనిట్లు విక్రయమవడంతో ఏప్రిల్‌లో ఓలా మార్కెట్ షేర్ 50% దాటింది. ఈవీ టూవీలర్ మార్కెట్ క్షీణిస్తున్నా అది ఓలాపై ఎలాంటి ప్రభావం చూపకపోవడం గమనార్హం. కాగా ఈవీ టూవీలర్ సేల్స్ మార్చితో పోలిస్తే 52% తగ్గాయి. ఏప్రిల్‌లో మొత్తం 64,013 యూనిట్లే అమ్ముడుపోయాయి. కాగా మార్చిలో భారత్‌లో ఏకంగా 1,36,000 యూనిట్లు సేల్ అయ్యాయి.

Similar News

News March 3, 2026

ప్రతి వ్యక్తికీ 55 లీటర్ల మంచి నీళ్లు!

image

AP: గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికీ రోజుకు 55 లీటర్ల మంచి నీటిని అందించాలని అధికారులను CM చంద్రబాబు, DyCM పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇవాళ వీరిద్దరూ ఉండవల్లిలో 2 గంటలు <<19287163>>భేటీ అయ్యారు<<>>. జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టు, గ్రామీణాభివృద్ధిపై సమీక్షించారు. అటవీ శాఖ చేపట్టిన హనుమాన్ ప్రాజెక్ట్ వివరాలను CBNకు పవన్ తెలియజేశారు. స్థానిక ఎన్నికలు, TTD వివాదాలు, నామినేటెడ్ పదవుల భర్తీ అంశాలపై చర్చించినట్లు సమాచారం.

News March 3, 2026

క్యాన్సర్‌తో 2023లో లక్ష మంది మృతి!

image

భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. 1990 నుంచి 2023 మధ్య కాలంలో ఈ కేసులు 477%, మరణాలు 352% పెరిగాయని ‘లాన్సెట్’ నివేదిక తెలిపింది. 2023లోనే దేశంలో 2.03 లక్షల కేసులు, లక్ష మరణాలు సంభవించాయి. ప్రపంచవ్యాప్తంగా 2050 నాటికి ఈ కేసులు 35 లక్షలకు చేరుతాయని అంచనా. ఈ వ్యాధి పట్ల అవగాహన, ముందస్తు పరీక్షలు అత్యవసరమని వాషింగ్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు హెచ్చరించారు.

News March 3, 2026

గ్రహణం ఎఫెక్ట్.. టీమ్‌ఇండియా ప్రాక్టీస్ ఆలస్యం!

image

ENGతో జరగనున్న T20 WC సెమీస్ కోసం టీమ్‌ఇండియా ముంబై వాంఖడే స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈరోజు 6PM నుంచి 9PM వరకు ప్రాక్టీస్ చేయాల్సి ఉంది. అయితే గ్రహణం కారణంగా షెడ్యూల్ టైమింగ్స్ మార్చినట్లు జాతీయ మీడియా పేర్కొంది. 6.47PMకి గ్రహణం ముగియడంతో 7PM నుంచి ప్రాక్టీస్ మొదలెట్టినట్లు తెలిపింది. గ్రహణం టైంలో ప్రాక్టీస్ చేయడం మంచిది కాదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.