News October 26, 2024
సినిమా ఛాన్స్‌లు రాకపోయినా ప్రశ్నిస్తూనే ఉంటా: ప్రకాశ్ రాజ్

సమాజంలో జరిగే తప్పులను చూస్తూ ఊరుకోలేనని నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. తాను సినిమా అవకాశాలు కోల్పోయినా ప్రశ్నించడం ఆపనని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘నా కుమారుడి (సిద్ధు) మరణంతో బాధలో కూరుకుపోయా. కానీ నాకు కుటుంబం ఉంది. వృత్తి ఉంది. నాకంటూ మనుషులున్నారు. జీవితం ఉంది. అందుకే తిరిగి నిలబడ్డా. నా టాలెంట్ చూసి ప్రజలు ఆదరించారు. వారి ప్రేమ వల్లే ఇంకా నటుడిగా కొనసాగుతున్నా’ అని ఆయన చెప్పుకొచ్చారు.
Similar News
News February 13, 2026
మున్సిపోల్స్: కరీంనగర్లో బీజేపీలోకి ఇద్దరి చేరిక

TG: కరీంనగర్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 13వ డివిజన్లో గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి తెల్ల లక్ష్మి, 15వ డివిజన్లో విజయం సాధించిన ఏఐఎఫ్బీ అభ్యర్థి విపల సాయి జ్యోతి బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కరీంనగర్ కార్పొరేషన్లో 66 సీట్లు ఉండగా బీజేపీ 30 సీట్లు గెలిచింది. తాజాగా ఇద్దరి చేరికతో ఆ పార్టీ బలం 32కి చేరింది.
News February 13, 2026
T20WC: నెదర్లాండ్స్ ఘోర ఓటమి

చెన్నై వేదికగా USAతో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ ఘోరంగా ఓడింది. 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు 15.5 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌట్ అయింది. బాస్ డీ లీడే(23) టాప్ స్కోరర్‌గా నిలిచారు. మిగతా బ్యాటర్లందరూ చేతులెత్తేయడంతో భారీ ఓటమి తప్పలేదు. హర్మీత్ సింగ్ 4 ఓవర్లలో 21 పరుగులే ఇచ్చి 4 వికెట్లు తీశారు.
News February 13, 2026
వాలంటైన్స్ డే.. ఆ లింక్‌లపై క్లిక్ చేయొద్దు!

TG: వాలంటైన్స్ డే సందర్భంగా సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలో మోసాలకు పాల్పడుతున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. నకిలీ డేటింగ్ ప్రొఫైళ్లు, గిఫ్ట్ ఆఫర్లు, పూల డెలివరీ, డిస్కౌంట్ల పేరిట లింక్‌లు వస్తే జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. వాటిపై క్లిక్ చేస్తే నకిలీ పేమెంట్ వెబ్ సైట్లు, యాప్స్ డౌన్లోడ్ అయి డబ్బు మాయమవుతాయని తెలిపారు. అటు OTPలు, బ్యాంక్ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని పేర్కొన్నారు.


