News March 5, 2025
నన్ను సస్పెండ్ చేసినా.. బీసీ ఉద్యమం ఆగదు: తీన్మార్ మల్లన్న

TG: తనను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేసినంత మాత్రాన BC ఉద్యమం ఆగదని MLC తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. HYD ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన తప్పు అని, ఆ చిత్తు కాగితం తగలబెట్టడం తప్పా? అని ప్రశ్నించారు. కులగణన దేశానికి ఆదర్శంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. KCR సమగ్ర కుటుంబ సర్వే పకడ్బందీగా చేశారని, నూటికి నూరు శాతం చేస్తేనే సర్వే ఆదర్శం అవుతుందని తెలిపారు.
Similar News
News October 13, 2025
నకిలీ మద్యం కేసు.. జోగి రమేశ్ సవాల్

AP: నకిలీ మద్యం కేసులో తనపై వస్తున్న ఆరోపణలపై మాజీ మంత్రి <<17996336>>జోగి రమేశ్<<>> మరోసారి స్పందించారు. ఇదంతా చంద్రబాబు అల్లిన కట్టు కథ అని ఆరోపించారు. తిరుమల సన్నిధిలో ప్రమాణం చేసేందుకు, లై డిటెక్టర్ టెస్టుకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. ప్రమాణానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సిద్ధమా అని సవాల్ విసిరారు. జనార్ధన్‌తో తనకు ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవని, బలవంతంగా అతనితో తన పేరు చెప్పించారని మండిపడ్డారు.
News October 13, 2025
వైసీపీ నేరాలను టీడీపీపైకి నెట్టే కుట్ర: చంద్రబాబు

AP: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు టీడీపీ ఎంపీలతో జరిగిన భేటీలో కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకా హత్య కేసు తరహాలోనే నకిలీ మద్యం కేసూ ఉందన్నారు. అంతా వాళ్లే చేసి తమపై నింద మోపుతున్నారని చెప్పారు. క్రిమినల్ మాస్టర్ మైండ్‌కు జగన్ ఉదాహరణ అని, వైసీపీ క్రిమినల్ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. వాళ్ల నేరాలను టీడీపీపై నెట్టేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.
News October 13, 2025
కొత్త మద్యం పాలసీపై హైకోర్టులో పిటిషన్

TG: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మద్యం పాలసీపై అనిల్‌కుమార్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలు పెట్టారని, లాటరీలో షాపు దక్కకపోతే ఆ డబ్బు ఎక్సైజ్ శాఖకే వెళ్తుందన్నారు. షాప్ రానివారికి రూ.3 లక్షలు తిరిగిచ్చేలా ఆ శాఖను ఆదేశించాలని, ఆ GOను కొట్టేయాలని కోర్టును కోరారు. దీనిపై విచారించిన కోర్టు ఎక్సైజ్ శాఖకు నోటీసులు జారీ చేసింది. విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.