News January 8, 2025
సినిమాలు మానేద్దామనుకున్నా: శివ కార్తికేయన్

తాను ఒకప్పుడు సినిమాలు మానేద్దామని అనుకున్నట్లు తమిళ హీరో శివ కార్తికేయన్ వెల్లడించారు. ‘ఏమీలేని స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చావు. అజిత్, విక్రమ్ లాంటి వారూ బ్యాగ్రౌండ్ లేకుండానే ఎదిగారు’ అంటూ తన భార్య మోటివేట్ చేయడంతో ఆగిపోయానని తెలిపారు. ‘ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టం. యాంకర్ స్థాయి నుంచి యాక్టర్గా ఎదిగిన నన్ను చాలా మంది అవమానించారు. నా విజయమే వారికి సమాధానం’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
Similar News
News January 9, 2026
నవ గ్రహాలు – అధి దేవతలు

1. ఆదిత్యుడు – అగ్ని
2. చంద్రుడు – నీరు
3. అంగారకుడు – భూదేవి
4. బుధుడు – విష్ణు
5. గురు – బ్రహ్మ
6. శుక్రుడు – ఇంద్రుడు
7. శని – యముడు
8. రాహువు – దుర్గ
9. కేతువు – చిత్ర గుప్తుడు
News January 9, 2026
ధనుర్మాసం: ఇరవై ఐదో రోజు కీర్తన

కృష్ణుడి అనుగ్రహం కోసం గోపికలు నిద్రిస్తున్న గోపికను నిద్రలేపే సన్నివేశం ఇది. బయట ఉన్నవారు ఆమెను ‘చిలుక’ అని పిలుస్తూ త్వరగా రమ్మనగా ఆమె చమత్కారంగా బదులిస్తుంది. చివరకు కంసుని గజమైన కువలయాపీడాన్ని, శత్రువులను సంహరించిన ఆ కృష్ణుని గుణగానం చేస్తేనే వ్రతం ఫలిస్తుందని, అందరం కలిసి భగవంతుడిని కీర్తిద్దామని వారు ఆమెను సాదరంగా ఆహ్వానిస్తారు. ఇలా అందరూ కలిసి భక్తితో కృష్ణుని వైపు పయనిస్తారు. <<-se>>#DHANURMASAM<<>>
News January 9, 2026
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బూట్లు, బెల్టులు

TG: వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బూట్లు, బెల్టులు ప్రభుత్వం అందజేయనుంది. విద్యాశాఖ ప్రతిపాదనలను CM రేవంత్ రెడ్డి ఆమోదించారు. తద్వారా దాదాపు 20 లక్షలకు పైగా విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. అదే సమయంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఆడబిడ్డలకు ప్రాధాన్యం ఇవ్వాలని CM సూచించారు. దీంతో మొదటి విడత పాఠశాలలు బాలికలకు కేటాయించనున్నారు.


