News March 23, 2025

వీల్‌ఛైర్‌లో ఉన్నా నాతో క్రికెట్ ఆడిస్తారు: ధోనీ

image

తాను నడవలేని స్థితిలో వీల్‌ఛైర్‌లో ఉన్నా సీఎస్కే ఫ్రాంచైజీ లాక్కెళ్లి క్రికెట్ ఆడిస్తుందని భారత క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీ అన్నారు. తాను ఆడాలనుకున్నంత కాలం ఆడతానని స్పష్టం చేశారు. CSK ఫ్రాంచైజీ అంటే తనదేననే ఫీల్ వస్తుందన్నారు. కాగా 43 ఏళ్ల ధోనీ ఐపీఎల్ ఆరంభం నుంచి సీఎస్కేకి ఆడుతున్న విషయం తెలిసిందే. ఇవాళ ముంబైతో జరగనున్న మ్యాచులో ఆయన బరిలోకి దిగనున్నారు.

Similar News

News March 25, 2025

పరీక్ష రాయనివ్వకపోతే చనిపోతా.. పదో తరగతి విద్యార్థిని ఆవేదన

image

TG: పదో తరగతి ప్రశ్నాపత్రం <<15867946>>లీకేజీ<<>> కేసులో తనను అన్యాయంగా డీబార్ చేశారని నకిరేకల్‌కు చెందిన విద్యార్థిని ఝాన్సీరాణి ఆవేదన వ్యక్తం చేసింది. తాను పరీక్ష రాస్తుండగా కిటికీ వద్దకు వచ్చిన కొందరు బెదిరించి పేపర్ ఫొటో తీసుకున్నారని వాపోయింది. తనపై డీబార్ ఎత్తివేసి మళ్లీ పరీక్ష రాయనివ్వాలని కోరింది. లేదంటే ఆత్మహత్యే దిక్కని కన్నీళ్లు పెట్టుకుంది. అటు ఈ కేసులో ఓ మైనర్ సహా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

News March 25, 2025

‘RRR’ సినిమాకు మూడేళ్లు!

image

హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ సినిమా విడుదలై మూడేళ్లవుతోంది. సరిగ్గా ఇదేరోజున 2022లో ఈ చిత్రం రిలీజై భారీ విజయాన్ని అందుకుంది. ‘మూడేళ్ల క్రితం విడుదలైన RRR సినిమా ప్రపంచాన్ని ఊపేసింది. నాటు నాటు పాటకు హీరోలు వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల కేరింతలు ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి’ అని మేకర్స్ ట్వీట్ చేశారు.

News March 25, 2025

మా ఎన్నికల్లో జోక్యానికి భారత్, చైనా యత్నిస్తాయి: కెనడా

image

తమ దేశంలో వచ్చే నెల 28న జరిగే ఎన్నికల్లో భారత్, చైనా, రష్యా, పాకిస్థాన్ జోక్యం చేసుకునేందుకు యత్నించనున్నాయని కెనడా నిఘా సంస్థ CSIS డిప్యూటీ డైరెక్టర్ వానెసా లాయిడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘AIని వాడుకుని చైనా ఈ చర్యకు పాల్పడేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. భారత్‌కు కూడా ఎన్నికల్ని ప్రభావితం చేయాలన్న ఉద్దేశాలున్నట్లు మా దృష్టికి వచ్చింది’ అని ఆమె పేర్కొన్నారు. ఆ ఆరోపణల్ని భారత్, చైనా ఖండించాయి.

error: Content is protected !!