News November 12, 2024
ఇండియాలో తయారైనప్పటికీ ధరల్లో వ్యత్యాసం!

యాపిల్ మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసేందుకు చాలా మంది మొగ్గుచూపుతుంటారు. అప్పులు చేసైనా సరే iPhone కొనేయాల్సిందేనని భావిస్తుంటారు. అయితే, దేశాలను బట్టి వీటి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. ఇండియాలో iPhone 16 Pro(256GB) ఫోన్ ధర ₹1,29,999గా ఉండగా సింగపూర్లో ₹1,10,686, దుబాయ్లో ₹1,07,834, మలేషియాలో ₹1,05,259కు లభిస్తుంది. ఇండియాలో తయారవుతున్నప్పటికీ ఎందుకీ వ్యత్యాసమని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Similar News
News December 12, 2025
‘టెన్త్’ షెడ్యూల్పై వివాదం.. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వివరణ

TG: టెన్త్ పరీక్షల షెడ్యూల్ (MAR 14-APR 16) <<18526038>>వివాదంపై<<>> స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ వివరణ ఇచ్చారు. ‘పేరెంట్స్, స్టూడెంట్స్ రిక్వెస్ట్తో పరీక్షల మధ్య తగినంత గ్యాప్ ఇచ్చాం. CBSE, ఇతర బోర్డుల విధానాలను అధ్యయనం చేసి సైంటిఫిక్గా షెడ్యూల్ రూపొందించాం. మ్యాథ్స్, సైన్స్, సోషల్కు ఎక్కువ రోజులు సెలవులిచ్చాం. స్టూడెంట్స్ ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా రివిజన్ చేసుకోవచ్చు’ అని పేర్కొన్నారు.
News December 12, 2025
IVFతో అప్పుల పాలవుతున్న జంటలు

ప్రస్తుతకాలంలో సంతానలేమి సమస్య పెరగడంతో చాలామంది IVF చికిత్స చేయించుకుంటున్నారు. అయితే దీనివల్ల 90శాతం జంటలు అప్పులపాలవుతున్నట్లు ICMR నివేదికలో వెల్లడైంది. ఈ చికిత్సను ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY) పరిధిలోకి తీసుకురావాలని ICMR సూచించింది. ఈ ఖర్చులను కూడా రీయింబర్స్ చేయాలని ఆ నివేదికలో సిఫార్సు చేసింది. దీనిపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.
News December 12, 2025
బస్సు ప్రమాదం.. ఘటనా స్థలానికి హోంమంత్రి

AP: అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో జరిగిన <<18539765>>బస్సు ప్రమాద<<>> స్థలానికి హోం మంత్రి అనిత హుటాహుటిన బయలుదేరారు. మరికాసేపట్లో ఘటనా స్థలానికి చేరుకోనున్నారు. ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన మంత్రి.. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మంత్రి సంధ్యారాణి సైతం ఘటనా స్థలానికి బయల్దేరారు. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయారు.


