News June 6, 2024
25ఏళ్లే అయినా అదరగొట్టారు!

ఈ లోక్‌సభ ఎన్నికల్లో 25ఏళ్ల వయసున్న నలుగురు అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచి సత్తాచాటారు. బిహార్‌లోని సమస్తిపుర్‌లో శాంభవీ (LJP) 1.87లక్షల మెజార్టీతో గెలుపొందారు. రాజస్థాన్‌లోని భరత్‌పుర్ నుంచి పోటీకి దిగిన సంజనా జాతవ్ (కాంగ్రెస్) 51వేల మెజార్టీతో గెలిచారు. ఇక యూపీలోని కౌశాంబి నుంచి పుష్‌పేంద్ర సరోజ్ (SP) లక్ష మెజార్టీతో గెలుపొందారు. మచలీషెహర్‌లో ప్రియా సరోజ్ (SP) 35వేల మెజార్టీతో గెలిచారు.
Similar News
News September 11, 2025
ఇంటర్‌లో ప్రవేశాలు.. రెండు రోజులే ఛాన్స్

TG: ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశాలకు బోర్డు మరో అవకాశం కల్పించింది. ఇవాళ, రేపు ఆన్‌లైన్ <
News September 11, 2025
నేడు బాపట్ల జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. సూర్యలంకలో తాటి మొక్కలు నాటి ‘గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత నగరవనం అటవీ పార్కులో జరిగే జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవంలో పాల్గొని అమరవీరుల స్మారక స్తూపాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం అమరవీరుల కుటుంబాలతో సమావేశమై ఆర్థికసాయం అందజేస్తారు.
News September 11, 2025
వరద బాధితులకు వెంటనే పరిహారం విడుదల చేయాలి: మంత్రి

TG: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన బాధితులకు వెంటనే పరిహారం చెల్లించాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదేశించారు. ‘పరిహారం అందని వారికి వెంటనే నిధులు విడుదల చేయండి. బాధితులు పరిహారం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి రాకూడదు. చెరువులు, రోడ్ల మరమ్మతులకు ప్రాధాన్యత ఇవ్వాలి. తీవ్రంగా దెబ్బతిన్న జిల్లాలకు ₹10Cr, ఇతర జిల్లాలకు ₹5Cr విడుదల చేశాం’ అని తెలిపారు.