News September 5, 2024
దండించినా ఎప్పటికీ విద్యార్థి గుండెల్లోనే!

ఎంతైనా 90sలో చదువులు వేరేలా ఉండేవి. ఉపాధ్యాయులు దండించడం వల్లే చాలా మంది విద్యార్థులు గాడినపడిన వారున్నారు. తమ చేతులపై ఎన్నో కర్రలు విరిగినప్పటికీ.. అవన్నీ ఇప్పుడు గుర్తుచేసుకొని ఎమోషనల్ అవుతున్నారు. అయితే, చదువులో ఎంకరేజ్ చేస్తూ, ఆటపాటలను సైతం ప్రోత్సహించిన ఫేవరెట్ టీచర్లు ప్రతి ఒక్కరికీ ఉంటారు. అలాంటి గొప్ప టీచర్‌తో మీకున్న అనుభవాలను, వారి పేర్లేంటో కామెంట్ చేయండి.
Similar News
News December 26, 2025
రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ భేటీ

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ప్రధాని నరేంద్ర మోదీ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రపతి భవన్లో ఆమెను కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. వీర్ బాల్ దివస్ సందర్భంగా పలు రంగాలలో రాణించిన, ధైర్యసాహసాలు ప్రదర్శించిన 19 మంది పిల్లలకు ఇవాళ ఉదయం ప్రధాన మంత్రి <<18676177>>రాష్ట్రీయ బాల్ పురస్కార్<<>> అవార్డులను రాష్ట్రపతి అందజేసిన సంగతి తెలిసిందే.
News December 26, 2025
భారత్ ఘన విజయం

శ్రీలంక ఉమెన్స్‌తో జరిగిన 3వ టీ20లో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 113 పరుగుల లక్ష్యాన్ని 2 వికెట్లు కోల్పోయి 13.2 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ షెఫాలీ వర్మ లంక బౌలర్లకు చుక్కలు చూపించారు. కేవలం 42 బంతుల్లోనే 3 సిక్సర్లు, 11 ఫోర్లతో 79* రన్స్ చేశారు. హర్మన్ 21* పరుగులతో రాణించారు. ఈ విజయంతో మరో 2 మ్యాచులు ఉండగానే 5 టీ20ల సిరీస్‌ను భారత్ 3-0తో కైవసం చేసుకుంది.
News December 26, 2025
VHT: మరో మ్యాచ్ ఆడనున్న కోహ్లీ?

విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ తరఫున కోహ్లీ అదరగొడుతున్నా విషయం తెలిసిందే. ఆడిన 2 మ్యాచుల్లో 133, 77 రన్స్ చేశారు. నేషనల్ టీమ్‌లోని ప్లేయర్లంతా డొమెస్టిక్ క్రికెట్లో ఏడాదికి కనీసం 2మ్యాచులు ఆడాలని BCCI రూల్ పెట్టింది. అందుకే రోహిత్, కోహ్లీ చెరో రెండు మ్యాచులు ఆడేశారు. కానీ కోహ్లీ మరో మ్యాచ్ కూడా ఆడనున్నట్లు తెలుస్తోంది. జనవరి 6న రైల్వేస్‌తో జరిగే మ్యాచ్‌లోనూ విరాట్ పాల్గొనే అవకాశమున్నట్లు సమాచారం.


