News February 4, 2025
సాధువులకు బట్టలు లేకున్నా చలి పెట్టదు.. ఎందుకంటే?

ప్రయాగ్రాజ్లో గడ్డ కట్టే చలిలోనూ అఘోరాలు, నాగ సాధువులు ఒంటిపై నూలు వస్త్రం కూడా లేకుండా ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దీనిపై నాగసాధువులు చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. ‘సాధన చేసినప్పుడు చలి అనేదే ఉండదు. బూడిదను శరీరానికి రాసుకుంటాం కాబట్టి చలి తక్కువేస్తుంది. దీనివల్ల రోగాలు కూడా రావు. జపం చేయడం, భగవంతుడిని ప్రార్థించడమే అతిపెద్ద వస్త్రం. ఇంకేం వస్త్రాలు అక్కర్లేదు’ అని తెలిపారు.
Similar News
News November 23, 2025
శబరిమలకు భక్తుల క్యూ.. వారంలోనే 5.75 లక్షల మంది దర్శనం

మండల-మకరవిళక్కు యాత్ర ప్రారంభంతో శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. నవంబర్ 16 నుంచి మొదలైన యాత్రలో తొలి వారంలోనే 5.75 లక్షలకు పైగా భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. శనివారం ఒక్కరోజే సాయంత్రం 7 గంటల వరకు 72,845 మంది సన్నిధానానికి చేరుకున్నారు. వర్షం పడినా యాత్రపై ప్రభావం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ నిర్వాహకులు చెప్పారు.
News November 23, 2025
నోబెల్ వచ్చినా దేశం దాటలేని పరిస్థితి

ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి విన్నర్ వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. డిసెంబర్ 10న నార్వేలో జరిగే నోబెల్ పురస్కారాల వేడుకకు హాజరైతే, ఆమెను పరారీలో ఉన్న నేరస్థురాలిగా ప్రకటిస్తామని ఆ దేశ అటార్నీ జనరల్ హెచ్చరించారు. ప్రజాస్వామ్యం, ప్రజల హక్కుల కోసం పోరాటం చేసినందుకు ఆమెకు నోబెల్ బహుమతి ప్రకటించినప్పటికీ, దేశం బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
News November 23, 2025
హైదరాబాద్ NGRIలో ఉద్యోగాలు

HYDలోని CSIR-NGRI 3 ప్రాజెక్ట్ అసోసియేట్, అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 27వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BSc, MSc, M.Tech (జియో ఫిజిక్స్, అప్లైడ్ జియోఫిజిక్స్, ఎర్త్ సైన్సెస్, మెరైన్ జియోఫిజిక్స్), MS ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అర్హులు. NOV 28, DEC 3 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. https://www.ngri.res.in/


