News August 30, 2024
సీఎం చెప్పినా అమలు కాని ఆదేశాలు

TG: వినాయక మండపాలకు <<13971397>>ఉచిత కరెంట్ <<>>ఇవ్వాలని CM రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. మండపాలకు దరఖాస్తు చేసుకుంటున్న నిర్వాహకుల నుంచి విద్యుత్ శాఖ రూ.1000 వసూలు చేస్తోంది. డబ్బు చెల్లిస్తేనే విద్యుత్ సరఫరా చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఫ్రీ కరెంట్‌పై తమకు ఎలాంటి అధికారిక ఉత్తర్వులు రాలేదని అధికారులు వెల్లడిస్తున్నారు. దీంతో ప్రభుత్వం స్పందించాలని నిర్వాహకులు కోరుతున్నారు.
Similar News
News December 12, 2025
మునగాకుతో ఎన్నో లాభాలు

ఆయుర్వేదంలో మునగకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. NCBI నివేదిక ప్రకారం.. మునగ ఆకుల్లో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్-ఎ, సి, బి కాంప్లెక్స్, బీటా-కెరోటిన్, అమైనో యాసిడ్స్, ఫినోలిక్‌లతో పాటు, 40 కంటే ఎక్కువ రకాల యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇందులో ఉండే పీచు, జీర్ణవ్యవస్థతో పాటు పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది.
News December 12, 2025
తండ్రయిన టాలీవుడ్ యంగ్ హీరో

టాలీవుడ్ యంగ్ హీరో తిరువీర్ తండ్రయ్యారు. ఆయన భార్య కల్పనారావు మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా తిరువీర్ తన ఆనందాన్ని X వేదికగా పంచుకున్నారు. ‘నాయినొచ్చిండు ❤️’ అంటూ బిడ్డ చేతిని పట్టుకున్న ఫొటోను షేర్ చేయగా అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ‘మసూద’, ‘పలాస 1978’, ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన తిరువీర్.. కల్పనారావును 2024లో వివాహం చేసుకున్నారు.
News December 12, 2025
‘అల్లూరి’ ప్రమాదంలో చనిపోయింది వీరే

AP: అల్లూరి జిల్లాలో జరిగిన <<18540010>>ప్రమాదంలో<<>> 9 మంది చనిపోయారు. వారిలో ఐదుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. వారి వివరాలు.. శైలా రాణి(తెనాలి), శ్యామల(తిరుపతి), పి.సునంద(పలమనేరు), శివశంకర్ రెడ్డి(పలమనేరు), నాగేశ్వరరావు(చిత్తూరు), కావేరి కృష్ణ(బెంగళూరు), శ్రీకళ(చిత్తూరు), దొరబాబు(చిత్తూరు), కృష్ణకుమారి(బెంగళూరు). కాగా గాయపడిన 25 మందికి చింతూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.


